తెలంగాణ

రిజిస్ట్రేషన్లశాఖలో ‘సప్త సేవలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: స్థిర, చరాస్థుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దస్తావేజులు, భూ రికార్డులను శాశ్వతంగా భద్రపరచడానికి డిజిటలైజేషన్ ఆఫ్లికేషన్‌ను రూపొందించింది. దీంట్లో భాగంగా ‘పబ్లిక్ డాటా ఎంట్రీ సిస్టమ్’తో పాటు ’సప్త సేవలు’ పేరిట మరికొన్ని సేవలను అమలు చేస్తోంది. ఆస్తుల క్రియ, విక్రయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిడివి తగ్గించడానికి పబ్లిక్ డాటా ఎంట్రీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దస్తావేజుల నమోదు కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే పౌరులు ముందుగానే తమ పత్రాలను ఇంటర్నెట్ ద్వారా అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు సమయ వ్యవధి తగ్గడం వల్ల జాప్యాన్ని నిరోధించడానికి దోహదపడుతుంది. రిజిస్ట్రేషన్ కొరకు దస్తావేజులు దాఖలు చేసిన వెంటనే దరఖాస్తుదారుడికి ఫోన్‌లో ఎస్‌ఎంఎస్ ఆలర్ట్ మేసేజి వస్తుంది. ఆ తర్వాత దస్తావేజుల స్కానింగ్ పూర్తి అయిన వెంటనే ఫైనల్‌గా మరొక ఆలర్ట్ మేసేజ్ వస్తుంది. కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద విపరీతమైన రద్దీ ఉంటే మరికొన్ని చోట సాధారణ రద్దీ మాత్రమే ఉంటుంది. అత్యధిక రద్దీ ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలను రాత్రి వరకు పొడిగించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ బోయినపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఒక షిప్ట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెండవ షిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది. మున్ముందు ఇదే తరహాలో రద్ధీ ఎక్కువగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెండు షిఫ్ట్‌లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రవాణాశాఖలో వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం పౌరులు స్లాట్ బుక్ చేసుకున్నట్టుగానే రిజిస్ట్రేషన్ శాఖలో కూడా స్లాట్ బుకింగ్ అవకాశాన్ని కల్పించింది. రిజిస్ట్రేషన్స్ కోసం వెళ్లే వారు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకొని స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్స్‌కు అవసరమైన స్టాంప్ పత్రాలను స్టాంప్ వెండర్స్ నుంచి కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి కానీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్టాంప్ వెండ ర్స్ కొన్ని సందర్భాలలో తప్పుగా గణించడం అధిక రుసుం చెల్లించాల్సి ఉంటుం ది. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఇక నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా కూడా స్టాంప్ పత్రాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. సప్త సేవలలో ఇ-స్టాంప్ విధా నం ముఖ్యమైంది. తెలంగాణ-అసెస్‌మెంట్ మేనేజ్‌మెంట్ అండ్ పేమెంట్ సిస్టమ్ (ఇ-స్టాంప్) ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తులు ఆన్‌లైన్‌లో స్టాంపుల సుంకం, రిజిస్ట్రేషన్ రుసుం, యాజర్ చార్జీలు, బదిలీ సుంకం తదితర వాటిని ఆన్‌లైన్‌లో చెల్లించి అందులోనే రశీదు పొందే అవకాశాన్ని కల్పించింది.