తెలంగాణ

తొమ్మిది శాఖల పద్దులకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: వ్యవసాయం, వాణిజ్యపన్నులు, రెవెన్యూ రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు, ఎక్సైజ్, రవాణా, హోం, సహకారం, పశుపోషణ శాఖలకు చెందిన పద్దులకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ శాఖలపై సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. వాణిజ్య పన్నులకు 302 కోట్లు, రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖకు 1533 కోట్లు, పౌరసరఫరాలకు 1871 కోట్లు, ఎక్సైజ్‌శాఖకు 191 కోట్లు, రవాణాకు 86 కోట్లు, హోంశాఖకు 4828 కోట్లు, వ్యవసాయానికి 5899 కోట్లు, సహకార శాఖకు 92 కోట్లు, పశుపోషణకు 594 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు సభ ఆమోదం తెలిపింది. రైతుల రుణమాఫీ ఇప్పటికే పూర్తయిందని, ఎక్కడైనా అర్హులైన రైతులకు ఈ సౌకర్యం వర్తించకపోతే, అలాంటి కేసులను పునఃపరిశీలిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని, రైతుల ఆత్మహత్యలను పూర్తిగా నివారించేందుకు ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు ఎవరు కూడా నిరాశానిస్పృహలకు గురికావద్దని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. 2017-18 బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి 7184 కోట్ల రూపాయలు కేటాయించామని, గత ఏడాదికంటే ఇది ఎక్కువేనని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 1087 ఎకరాల్లో పాలిహౌజ్‌లను నిర్మించి, పాలిహౌజ్‌ల నిర్మాణంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేని విధంగా రైతులకు చేయూత ఇస్తున్నామని వివరించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశామని, దాంతో రైతులకు టన్ను పామాయిల్‌కు గతంలో 6000 రూపాయలు లభిస్తుండగా, ఇప్పుడు 9400 రూపాయలు లభిస్తున్నాయన్నారు. పసుపు, మిర్చి, మసాలాల ప్రాసెసింగ్ యూనిట్లను కూడా త్వరలో నెలకొల్పుతున్నామని ప్రకటించారు. విత్తనోత్పత్తి భాండాగారంగా తెలంగాణను మారుస్తున్నామన్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించడం పూర్తయితే వ్యవసాయ రంగం పండగగానే మారిపోతుందన్నారు. సంక్షోభం నుండి సంక్షేమం వైపు వ్యవసాయ రంగం పరుగులు తీస్తుందని వివరించారు. బోధన్, మెదక్, మెట్‌పల్లి ప్రాంతాల్లో చెరకు పండించేందుకు రైతులు ముందుకు వస్తే నిజాం ఘగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ప్రకటించారు.
ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులను చౌకదుకాణాలద్వారా ఇస్తున్నామని, డీలర్లకు ఇస్తున్న కమిషన్‌ను త్వరలో పెంచుతామని పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మద్యనిషేధ ప్రచారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ మంత్రి పద్మారావు తెలిపారు. ఆర్టీసి బస్సులపై ఉన్న వ్యాట్‌ను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.