తెలంగాణ

బార్లు.. బార్లా తెరిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత బార్లు బార్లా తెరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో వివిధ పద్దుల (డిమాండ్ల)పై భట్టివిక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. అయితే భట్టి ప్రసంగానికి మంత్రులు పదేపదే అడ్డుపడ్డారు. బడ్జెట్‌పై భట్టి లోతుగా విమర్శించడం ప్రారంభించడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి టి. హరీష్‌రావు కల్పించుకుని బడ్జెట్‌పై మాట్లాడుతున్నారా? లేక పద్దులపై మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. తిరిగి భట్టివిక్రమార్క ప్రసంగిస్తూ అధికారం చేపట్టగానే అద్భుతాలు సృష్టించబోతున్నట్లు చెప్పారని అన్నారు. సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. మొత్తం అస్తవ్యస్తమైన పాలన అని, 35 లక్షల మంది రైతులు రుణ మాఫీ కాక కొత్త రుణాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన విమర్శించారు. రైతుల ఆత్మహత్యలను నిలుపుదల చేయలేకపోయారని, 9 గంటల విద్యుత్తు సరఫరా చేయలేకపోయారని ఆయన ధ్వజమెత్తారు. ట్రాక్టర్ల కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల భాండాగారంగా మారిందని ఆయన విమర్శించారు. మీకు విజన్ లేదని, మాకు విజన్ ఉంది కాబట్టే దేశం సుభిక్షంగా ఉందని అన్నారు.
ఈటల సవాల్..
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కల్పించుకుని విజన్ ఉందా? అని 20 సార్లు ప్రశ్నించారని, నిజానికి ఎవరు అధికారంలో ఉన్నా కాలం సహకరించాల్సి ఉంటుందని అన్నారు. 2014, 2015లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయని, గత ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిసాయని తెలిపారు. 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, ఎస్‌ఆర్‌ఎస్‌పి చివరి భూమి వరకూ నీరు ఇవ్వలేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని, అందుకు భట్టి కూడా సిద్ధమేనా అని ఈటల సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి కల్పించుకుని మంత్రి ఇలా దబాయించడం భావ్యం కాదని అన్నారు. 2 లక్షల 40 వేల ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉందని, ఇంకా చివరి భూమి వరకు ఇవ్వాలని తమ సభ్యుని అభిప్రాయమని తెలిపారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశలో తుంగతుర్తితో పాటు 350 చెరువులు నీటితో నింపామని అన్నారు. 25 వేల ఎకరాలకు నీరు ఇచ్చామని ఆయన తెలిపారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వడగండ్ల వానలతో రైతులు నష్టపోతే కనీసం అధికారులు పర్యటించలేదని భట్టి చేసిన విమర్శలో వాస్తవం లేదని, స్వయంగా తానే పర్యటించానంటూ ఒక పేపర్‌ను చూపించారు.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి గ్రామంలో నీటి పారుదల ఎత్తిపోతల పథకం సందర్శనకు వెళ్ళిన తమ పార్టీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని భట్టివిక్రమార్క ఆరోపించారు. అందుకు మంత్రి హరీష్ రావు అడ్డుపడి అరెస్టు చేయలేదని చెప్పారు. ఈ పథకాన్ని ప్రారంభించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళనని సుదర్శన్‌రెడ్డి పట్టుబడితే, ఏ హోదాలో ప్రారంభిస్తారని అధికారులు ప్రశ్నించారని ఆయన తెలిపారు. తిరిగి భట్టి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు.