తెలంగాణ

నీరా అమ్మకాలు త్వరలో ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: త్వరలోనే నీరా అమ్మకాలు ప్రారంభం అవుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు తెలిపారు. శాసన సభలో సోమవారం ఎక్సైజ్ శాఖ పద్దులపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ త్వరలోనే కల్లు, నీరా పాలసీ ప్రకటించనున్నట్టు చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే మద్యం షాపులకు నిబంధనల మేరకే అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. వైన్ షాపుల సంఖ్య పెరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని, గత సంవత్సరం కన్నా 102 షాపుల సంఖ్య తగ్గిందని చెప్పారు. ఆస్పత్రులు, దేవాలయాలు, పాఠశాలల వద్ద నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు ఉంటే చర్య తీసుకుంటామని చెప్పారు. ఈత చెట్లు తాటి చెట్లు ఎక్కేందుకు కేరళ నుంచి యంత్రాలను తెప్పిస్తున్నట్టు చెప్పారు. వాటిని పరిశీలించిన తరువాత గీత వృత్తి వారికి అందజేయనున్నట్టు మంత్రి తెలిపారు. హరిత హారంలో భాగంగా రెండు కోట్ల ఈత చెట్లు, తాటి చెట్లు పెంచుతున్నట్టు చెప్పారు. బెల్ట్ షాపులను అనుమతించేది లేదని చెప్పారు. ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంటే సహించేది లేదని, చర్య తీసుకుంటామని ఇప్పటి వరకు 266 కేసులు నమోద చేసినట్టు మంత్రి తెలిపారు.