తెలంగాణ

29మంది.. సౌదీలో బందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: సౌదీ అరేబియాలోని అల్‌హసాలో ఉన్న అల్ హజారీ ఓవర్‌సీస్ కంపెనీలో పని చేస్తున్న 29 మంది తెలంగాణ రాష్ట్ర వాసులను ఆ కంపెనీ గత 12 రోజులుగా నిర్బంధించిందని పురపాలక, ఐటి, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కె.తారక రామారావు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసికెళ్లారు.
వీరందరిని విడిపించి వారి వారి స్వస్థలాలకు తిరిగి తీసుకు వచ్చే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని కెటిఆర్ కేంద్రమంత్రికి సోమవారం లేఖ రాశారు. సౌదీ కంపెనీలో పని చేస్తున్న వీరంతా తమ స్వగ్రామాలకు వెళ్లిపోతామని వేడుకున్నా వినకుండా వారిని కంపెనీ యాజమాన్యం ఒక గదిలో బంధించి ఉంచిందని తెలిపారు. తిరిగి వెళ్లిపోతామన్న విజ్ఞప్తిని పట్టించుకోకపోవడమే కాకుండా ఒక్కొక్కరు 50 వేల డాలర్లు చెల్లించాలని, తిరిగి వెళ్లేందుకు అవసరమైన చార్జీలను చెల్లించేందుకు కూడా కంపెనీ యాజమాన్యం నిరాకరిస్తోందని తెలిపారు. వీరంతా ఎవరికి వారు వ్యక్తిగతంగా సౌదీలోని కార్మిక కోర్టు, అమిర్ కోర్టును ఆశ్రయించగా ఉపాధి కల్పించిన కంపెనీ మొత్తం ఖర్చు భరించి, వారందరిని 3 రోజుల్లోగా వారి స్వస్థలాలకు పంపించాలని అమిర్ కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా వారందరిని గదిలో నిర్బంధించారని కేంద్రమంత్రికి ఆ లేఖలో వివరించారు.
భోజనం, నీరు, మందులు ఇవ్వకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా 12 రోజులుగా చిత్ర హింసలు పెడుతున్నారని తెలిపారు. సౌదీ నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన బోరగళ్ల శేఖర్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని తమకు తెలియజేశారని మంత్రి కెటిఆర్ తెలిపారు.
డిఎన్‌ఏ పరీక్ష
అబుదాబిలో జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు తెలంగాణ వాసుల్లో ఒకరిని నిర్మల్‌కు చెందిన పిట్టల రవీందర్‌గా ఇప్పటికే గుర్తించగా, మరో ఐదుగురిని అబుదాబి ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మిగిలిన నాలుగు మృతదేహాలను గుర్తించేందుకు మృతుల బంధువులకు డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున వారిని అబుదాబి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కెటిఆర్ జిఎడి అధికారులను ఆదేశించారు. అవసరమైన పాస్‌పోర్టు, వీసాలను సమకూర్చాలని నిర్మల్, నిజామాబాద్ కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు, వారికి సహాయకులుగా మరో ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురు అబుదాబి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ నెల 21న అబుదాబికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసినట్లు తెలిపారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్ల్లాడుతున్న మంత్రి కెటిఆర్