తెలంగాణ

గర్భిణీలకు కెసిఆర్ కిట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: గర్భిణీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను వాటితో పాటు కెసిఆర్ పేరిట కిట్‌లను అందిస్తున్నామని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. గురువారం నాడు శాసనసభలో వివిధ పద్దుల కింద జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ, రాష్ట్రంలో ఆస్పత్రుల ముఖచిత్రాన్ని మార్చేశామని, ఔషధాలకు 300 కోట్లు కేటాయించామని అన్నారు. ఇక మీదట అన్ని ఆస్పత్రుల్లో సిసి కెమరాలు నెలకోల్పుతామని, కొత్త మంచాలు, బెడ్లు, బెడ్ షీట్లు, చివరికి కర్టన్లు కూడా కొత్తవి ఇస్తున్నామని, నిమ్స్ ఆస్పత్రిని వెయ్యి పడకల నుండి 1500 పడకల స్థాయికి పెంచామని అన్నారు. రాష్ట్రంలో 40 అధునాతన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు.
అంతకు ముందు పద్దులపై చర్చలో పద్మావతి మాట్లాడుతూ యాదాద్రి ప్రాజెక్టుకు మంచి ఆర్కిటెక్ట్‌ను నియమించాలని అన్నారు. కౌసర్ మొహియిద్దీన్ మాట్లాడుతూ దర్గాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరగా, జి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని అన్నారు. డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో అందర్నీ మమేకం చేయాలని సూచించారు. ఉత్తమకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంట్రా క్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ కేసుకూ కాంగ్రెస్ పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సభ్యుల ప్రశ్నలకు క్రీడల మంత్రి పద్మారావు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నెలకోల్పుతామని అన్నారు. హైదరాబాద్‌లో ఆరు నియోజకవర్గాల్లో స్టేడియంలు ఉన్నాయని, మరో 9 నియోజకవర్గాల్లో స్టేడియంలు నెలకోల్పాల్సి ఉందని తెలిపారు. ఎల్‌బి స్టేడియం వాణిజ్య సముదాయంగా మారిందని, దానిని ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు.కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కనీస వేతనాల బోర్డు ఇచ్చిన సిఫార్సులను అమలుచేసి తీరుతామని అన్నారు. దేవాదాయ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ భూములు కొన్ని ఆక్రమణల్లో ఉన్నాయని, వాటి వివాదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అటవీ మంత్రి జోగి రామన్న మాట్లాడుతూ జింకలను వేటాడిన ఘటనలో దోషులను పట్టుకుంటామని, వారిపై క్రిమినల్ చర్యలు చేపడతామని చెప్పారు. అనంతరం వివిధ శాఖల గ్రాంట్లను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం శాసనసభ భూధాన్ గ్రామ్‌ధాన్ బిల్లును, జీతాలు పింఛన్ల చెల్లింపు చట్టాల సవరణ బిల్లును సభ ఆమోదించింది.