తెలంగాణ

గురుకులాల్లో ఇంటర్‌కు దరఖాస్తుల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో 2017-18 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి మే 10వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు కార్యదర్శి బి శేషుకుమారి తెలిపారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు సైతం ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలని అన్నారు. బాలురకు సర్వేల్‌లోనూ, బాలికలకు హసన్‌పర్తిలోనూ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయని, మైనార్టీ జూనియర్ కాలేజీలు బాలురకు ఎల్‌బి నగర్, నాగారంలలో ఏర్పాటు చేసినట్టు ఆమె వివరించారు. ఆన్‌లైన్‌లో మార్చి 23 నుండి ఏప్రిల్ 18లోగా దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష మే 10వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరుగుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు రుసుం 120 రూపాయలు చెల్లించాలని, విద్యార్థుల ఎంపిక ప్రతిభ, రిజర్వేషన్లు ఆధారంగా జరుగుతుందని చెప్పారు.
15న అకౌంట్స్ టెస్టు
ఎగ్జిక్యూటివ్ అధికారులకు అకౌంట్స్ టెస్టును వచ్చే నెల 15వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ తెలిపింది. హైదరాబాద్ సహా పాత జిల్లా కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుందని కార్యదర్శి పేర్కొన్నారు.