తెలంగాణ

గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, మార్చి 24: గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుడు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన రోడ్డు పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థను స్థాపించే ప్రతిపాదన ఏమైనా ఉందా అన్న సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ గ్రామీణ ప్రాంతాలలో రూ.7వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసే ఆలోచన ఇప్పట్లో లేదని చెప్పారు.
త్వరలో వ్యాయామ టీచర్ల పోస్టుల భర్తీ
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పిఇటి పోస్టుల భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సభ్యులు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, షబ్బీర్ అలీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో వ్యాయామ సబ్జెక్టును ప్రవేశపెట్టి, ట్రైనింగ్ సెంటర్‌లో ఖాళీలను భర్తీ చేయాలని చేసిన విజ్ఞప్తి మేరకు కడియం స్పందిస్తూ వ్యాయామ విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
వాహనాల పన్ను ఉపసంహరణ
వసూలైన మోటారు వాహనాల పన్నులో 10 శాతాన్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయాలని రెండవ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విషయం వాస్తవమేనా అని ఎంఐఎం సభ్యులు సయ్యద్ అల్త్ఫా హైదర్ రిజ్వీ, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానమిస్తూ, ఖజానా ద్వారా వేతన ఖాతా పద్దు కింద మున్సిపల్ ఉద్యోగాలకు, వేతనాల పింఛన్ల చెల్లింపుల దృష్ట్యా యుఎల్‌బిలకు మోటారు వాహనాల పన్ను పరిహారాన్ని ఉపసంహరించడమైందన్నారు.