తెలంగాణ

బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: రాష్ట్రంలో మూడు నెలల్లోగా రేషన్ బియ్యం, నిత్యావసర వస్తువుల అక్రమ రవాణా, అక్రమ అమ్మకాలను ఆపాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందని, పేదలకు కేటాయించిన బియ్యం, నిత్యావసరాలు పేదలకే చెందాలని మంత్రి అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో రబీ కార్యాచరణ సమావేశంలో పాల్గొని మంత్రి జాయింట్ కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. రేషన్ బియ్యం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను నిరోధించి పేదలకు అందేలా చూడాలని అన్నారు.
సైబరాబాద్ కమిషనర్‌గా పని చేసిన సమయంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధించేందుకు చాలా కృషి చేశారని ప్రస్తుత పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్‌ను మంత్రి అభినందించారు. అధికారులు ఆత్మగౌరవంతో పని చేయడంతో 80 శాతం పంపిణీ వ్యవస్థ గాడిలో పడిందని అన్నారు. నిజమైన లబ్దిదారులకు రేషన్ బియ్యం సక్రమంగా అందే లక్ష్యం చేరుకోగానే కొత్త రేషన్ దుకాణాలను మంజూరు చేసే ఆలోచన ఉందని మంత్రి వెల్లడించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ రబీ (యాసంగి)లో 5.60 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి ధాన్యం సాగైందని, దీని వల్ల 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నారు. దీనిలో స్థానిక రైస్ మిల్లర్లు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, పౌరసరఫరాల సంస్థ 37 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు గాను 3 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆనంద్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ సమయానికి అవసరమైన 9.40 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చిత్రం.. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో జరిగిన రబీ కార్యాచరణ
సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి ఈటల రాజేందర్