తెలంగాణ

ఫిరాయింపుల వల్ల రాజకీయ అస్థిరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ఫిరాయింపుల వల్ల రాజకీయ అస్థితర ఏర్పడుతుందని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జెఎసి సమావేశం మంగళవారం జెఎసి కార్యాలయంలో జరిగింది. పార్టీ ఫిరాయింపులను రూపుమాపేందుకు అన్ని రాజకీయ పక్షాలు కృషి చేయాలని అన్నారు. జెఎసి రైతుల సమస్యలపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్టు చెప్పారు. ఆత్మహత్యల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతూ పాటలు రాయాలని, ప్రచారం చేయాలని కళాకారులను ఆయన కోరారు. సెప్టెంబర్‌లో 154 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆత్మహత్యల నివారణకు కృషి చేయడం అందరి బాధ్యత అని తెలిపారు. బ్యాంకు, రైల్వే ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్లు పాటించాలని కోరారు. త్వరలోనే జెఎసి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.
కేంద్ర వైఖరిని ఎండగడదాం
ప్రధాని మోదీది కక్షపూరిత వైఖరి: కుంతియా
19న కాంగ్రెస్ రాష్టవ్య్రాప్త నిరసనలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 15: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన వారిపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వేధిస్తున్నందుకు నిరసనగా ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎఐసిసి కార్యదర్శి, టిపిసిసి ఇన్‌చార్జి కార్యదర్శి రామచంద్ర కుంతియా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు, యువత, విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కుంతియా మంగళవారం పార్టీ నేతలు మల్లు రవి, సుధీర్‌రెడ్డి, శ్రీ్ధర్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో విమర్శించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చినా, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ అక్రమాలు వెలుగులోకి వచ్చినా వారిపై సిబిఐ విచారణ జరగలేదని అన్నారు. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయాలపైన మంత్రి సిబిఐ దాడులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి కక్షపూరిత వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు ఈ నెల 19న నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో బిజెపియేతర పార్టీలన్నీ కలిసి రావాలని, ప్రజలూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కుంతియా కోరారు.
‘ఉబెర్’కు మైనార్టీ కమిషన్ నోటీసులు
డ్రైవర్ ఆత్మహత్యపై క్యాబ్స్ అసోసియేషన్ ఫిర్యాదు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 15: ఉబెర్ డ్రైవర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆత్మహత్యకు కారణమైన ఉబెర్ యాజమాన్యంపై తగు చర్య తీసుకోవాలని కోరుతూ తెలంగాణ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ నిజాముద్దీన్ నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ కమిషన్ చైర్మన్ ఆబిద్ రసూల్ ఖాన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మైనార్టీ కమిషన్ ఉబెర్ యాజమాన్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి, హైదరాబాద్ పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. డ్రైవర్ ఆత్మహత్యపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత నెల 17న ఉబెర్ డ్రైవర్ జహీరుద్దీన్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థల వివాదం, ఆర్థిక ఇబ్బందులతో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.