తెలంగాణ

కోదండరామ్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌ను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క ప్రభృతులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇందిరా పార్కు వద్ద చాలా ఏళ్లుగా ఉన్న ధర్నాచౌక్‌ను ఉప్పల్ ప్రాంతానికి తరలించడాన్ని నిరసిస్తూ వామపక్షాల నేతృత్వంలో టిజాక్ ఇంకా వివిధ సంఘాల నాయకులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు 2-కె రన్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఆదివారం ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు ప్రొఫెసర్ కోదండరామ్ వామపక్షాల నేతలు తదితర ప్రజా సంఘాల నాయకులు చేరుకోవడం ప్రారంభించారు. పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లుగా అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించి ర్యాలీని భగ్నం చేశారు.
ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు ప్రొఫెసర్ పిఎల్ విశే్వశ్వర రావు, వివిధ సంఘాల నాయకులు వెంకట్‌రెడ్డి, వీరభద్రం, వేములపల్లి వెంకట రామయ్య, గోవర్ధన్, ఎన్. కృష్ణ, రవిచంద్ర, సంధ్య, ఇన్నయ్య, దేవేంద్ర, మహేశ్, వేణు, ప్రదీప్, పరశురాం ప్రభృతులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ ధర్నా చౌక్‌ను కాపాడుకోవడం అంటే, నిరసన తెలిపే హక్కును కాపాడుకోవడమేనని అన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తున్నదని ఆయన విమర్శించారు. నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ఇలాఉండగా అదుపులోకి తీసుకున్న ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులను పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు.

చిత్రం.. కోదండరామ్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు