తెలంగాణ

ఇఎస్‌ఐ సంచార క్లినిక్‌లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: ఇఎస్‌ఐ సంచార క్లినిక్‌లను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ రాజ్య బీమా సంస్ధ (ఇఎస్‌ఐసి) డిస్పెన్సరీల పరిధిలో లేని ప్రాంతాల్లోని కార్మికులకు వైద్య సేవలందించేందుకు సంచార వైద్య క్లీనిక్‌లను ప్రారంభించినట్లు చెప్పారు. మొత్తం 13 సంచార క్లినిక్‌లలో ఎనిమిది క్లినిక్‌లు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు, మిగిలినవి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూ రు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖప ట్నం, పశ్చిమగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. ప్రతి సంచార క్లినిక్ వాహనంలో ఒక వైద్యుడు, ఫార్మసిస్టు, అటెండెంట్ అవసరమైన సామాగ్రి, మందులు ఉంటాయన్నారు. ప్రతి వాహనం రోజుకు రెండు ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్క ప్రదేశంలో మూడు గంటల పాటు ఉండి ప్రాథమిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ప్రదేశాన్ని వారంలో రెండు సార్లు సందర్శిస్తుందని అన్నారు.
ఇఎస్‌ఐసి లబ్ధిదారులకు వేతన పరిమితిని 15 వేల నుంచి 21 వేల వరకు పెంచినట్లు ఆయన తెలిపారు. ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచినట్లు ఆయన వివరించారు. దేశంలో 4.30 కోట్ల మంది శ్రామికులు ఉన్నారని, వారిలో 1.80 కోట్ల మంది తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నారని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. జాతీయ ఒబిసిల సంఘానికి చట్టపరమైన హోదాను కల్పించినందుకు ప్రధా ని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

చిత్రం..ఇఎస్‌ఐ సంచార క్లినిక్‌లను ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ