తెలంగాణ

‘ఉగ్ర’చర్యలకు చెక్..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని తుద ముట్టించడంలో సఫలీకృతులైన తెలంగాణ పోలీస్, గ్రేహౌం డ్స్ దళాలు ఉగ్రవాదులను సహితం మట్టుబెట్టేందుకు దేశవ్యాప్తంగా నెట్ వర్కు పెంచుకున్నారు. అంతేకాకుండా ఓ అడుగు ముందుకేసి ఉగ్రవాదుల్లో సానుభూతిపరులుగా చేరి తమదైన శైలిలో ఉగ్రవాదుల చర్యలను అడ్డుకునేందుకు వెనుకాడడం లేదు.
ఈనెల 7న భోపాల్- ఉజ్జయిన్ పాసింజర్ రైలులో బాంబులు పెట్టి పేలుళ్లకు కుట్రపన్నిన ముగ్గురు ఉగ్రవాదులు డానిష్ అక్తర్, సయ్యద్ మీర్ హుస్సేన్, ఆతిఫ్ ముజఫర్‌లను తెలంగాణ పోలీస్ ఇచ్చిన సమాచారంతోనే ఇటార్సి వద్ద పైపేరియా గ్రామంలో అరెస్టు చేశారు. అదేవిధంగా ఉజ్జయిని ప్యాసింజర్ రైలు పేలుళ్ల కీలక సూత్రధారి సైఫుల్లా సమాచారాన్ని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసులకు అందించింది కూడా తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారేనని హైదరాబాద్‌కు చెందిన ఓ సీనియర్ ఎన్‌ఐఏ అధికారి తెలిపారు. తెలంగాణ పోలీస్ అధికారి ఇచ్చిన సమాచారంతోనే ఈనెల 8న లక్నోలో కరుడుగట్టిన ఉగ్రవాది సైఫుల్లాను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. కరుడుగట్టిన ఐసిస్ ఉగ్రవాదులతో తెలంగాణ పోలీసు బృందం పరిచయమేర్పరచుకుని వారిలో ఒకరిగా సానుభూతిపరుడంటూ వారి కదలికలను ఎప్పటికప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పోలీసులకు చేరవేసినట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీ నుంచే తెలంగాణకు చెందిన ఓ పోలీస్ బృందం వారిని వెంబడించి భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఉజ్జయిని రైలులో బాంబులు పెట్టింది కనుగొన్నారు. తమలో ఒకడని భావించిన తెలంగాణ పోలీసు అధికారికి ఐఎస్ సానుభూతిపరులు రైల్లో బాంబుపెట్టిన ఫోటోను పంపించారు. ఈ సమాచారాన్ని ఆ పోలీసు అధికారి యుపి, ఎంపి పోలీసులకు అందించారు. దీంతో ఉజ్జయిని ప్యా సింజర్ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఉగ్రవాదులను పైపేరీయాలో అరెస్టు చేశారు.
తెలంగాణ పోలీసులు ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడం కొత్త కాదు. 2015 డిసెంబర్‌లో బెంగుళూరులోని ఓ స్థావరంపై తెలంగాణ పోలీసులు దాడి చేసి ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. 2016 మార్చిలో నల్గొండ జిల్లా (సూర్యాపేట) బస్టాండ్‌లో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. కాగా ఈ ఎదురుకాల్పుల్లో ఓ సిఐ, మరో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా తప్పించుకున్న ఇద్దరు ఉగ్రవాదులు జానకిపూర్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. 2016 జూన్‌లో తెలంగాణలోని చొప్పదండి బ్యాంక్‌ను దోచుకున్న ఉగ్రవాదులు, బీహార్‌లో తలదాచుకోగా వారిని కూడా వెంబడించి అరెస్టు చేసింది తెలంగాణ పోలీసులేనని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఇదిలావుండగా భూపాల్-ఇటార్సి-లక్నో సంఘటనల్లో కీలకంగా వ్యవహరించి కేవలం ఆరుగంటల వ్యవధిలోనే పేలుళ్ల కుట్రను భగ్నం చేసి నిందితుల అరెస్టుకు దోహదపడ్డ తెలంగాణ పోలీస్‌ను ప్రశంసిస్తూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పోలీసులు కేంద్ర హోంశాఖకు ఓ నివేదికను అందజేసింది. తెలంగాణ పోలీస్ కేవలం తెలంగాణలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఉగ్రవాదులతోపాటు, సైబర్ నేరస్తులను పట్టుకోవడంలో నెట్‌వర్కును పెంచుకుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీస్‌ను అభినందించింది. ఉగ్రవాదులను కనిపెట్టడం, వారిని వెంబడించి పట్టుకోవడంలో తెలంగాణ పోలీస్‌కు మంచి పట్టు ఉంది. దీనికి ఇక్కడి ప్రాంత, భాష ఉర్దూ, హిందీ పట్ల పట్టు ఉండడమే.