తెలంగాణ

కిడ్నీ రోగాల బారిన ఆలగడప వాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మార్చి 26: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన సుమారు 30 మంది కిడ్నీ రోగం బారిన పడ్డారు. గ్రామంలో గత కొన్ని రోజులుగా కిడ్నీలు చెడిపోయి ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో 28 మంది ఇంకా రోగంతో ఇబ్బంది పడుతున్నారు. కాళ్లకు వాపు రావడం, మూత్రం సక్రమంగా రాక ఇబ్బందులు పడుతూ చివరికి డయాలసిస్ పరిస్థితికి చేరుకుంటున్నారు. ఆలగడపలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కిడ్నీ బాధితులు రాగా వారికి వైద్యాధికారులు డాక్టర్ వనిత, యునాని డాక్టర్ ఎఎ.ఖాన్ తమ పరిధిలోని వైద్యం అందిస్తున్నారు.
గ్రామంలో సుద్ద నీరు అధికంగా ఉందని, అదేవిధంగా అనేక మంది గ్రామంలో ఉన్న ప్యూరిఫైడ్ ప్లాంట్‌లోని నీరే తాగుతున్నారని తెలిసింది. అయితే గ్రామ పరిసరాల్లో ఫ్లోరిన్ శాతం ఉండాల్సిన మేరకే ఉందని రూరల్ వాటర్ స్కీం అధికారులు అంటున్నారు. 2 పిపిఎంలోపే ఫ్లోరిన్ ఉందని, కిడ్నీ బారిన పడడానికి ఫ్లోరిన్ ప్రభావం కాదని వారు అంటున్నారు. ఈ విషయాన్ని వైద్యాధికారులు స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు నివేదించారు. గ్రామంలో కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ పరిస్థితికి వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు.