తెలంగాణ

బంగారు తెలంగాణ కాదు... ఎండిపోతున్న తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, మార్చి 26: టిఆర్‌ఎస్ పార్టీ బంగారు తెలంగాణ కాదు ఎండిపోయిన తెలంగాణ చేస్తున్నదని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్ల గొండ జిల్లా మిర్యాల గూడ లోని ఒక ఫంక్షన్‌హాలులో జరిగిన ముఖ్యకార్తల సమావేశంలో ఆప్ నుండి చేరిన సుంకు శ్రీనివాస్, నరేందర్‌రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానం పలికిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబానికే బంగారు కుటుంబమైందని, తెలంగాణ కాదని ఆరోపించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏ సంవత్సరం కూడా రైతులు సక్రమం గా పంటలు పండించుకోలేదని, మెట్ట పంటలు మిర్చి, పత్తి, కందులు వేస్తే వాటికి మద్దతు ధర రావడం లేదని ఆరోపించారు. వైఎస్‌ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీలను అమలు చేయడంలో కెసిఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. తెలంగాణ పెనం నుండి పొయ్యిలోకి పడినట్టయిందని ఆరోపించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగే ఎన్నికల్లో జగన్ సిఎం కావడం ఖాయమని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు ప్రజావ్యతిరేక విధానాలతోనే పదవీచ్యుతులవుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, కార్యదర్శి ఎండి.సలీం, ఇరుగు సునీల్, నాయకులు కరుణాకర్‌రెడ్డి, ఎంవిఆర్ రెడ్డి, పిల్లుట్ల బ్రహ్మం, పసుపులేటి సోమయ్య, సైదులు, కోటిరెడ్డి పాల్గొన్నారు.