తెలంగాణ

డిస్కంల నష్టాలు రూ.5895 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ సంస్థల టర్నోవర్ పెరిగినప్పటికీ, నష్టాలు ఐదేళ్ల కాలంలో రూ. 5895 కోట్లకు చేరాయి. ఎక్కువ రేటు పెట్టి విద్యుత్‌ను కొనుగోలు చేయడం, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అంతంత మాత్రంగా ఉండడం, ఎక్కువగా విద్యుత్ పంపణీ నష్టాల వల్ల రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్ధలు నష్టాల్లో ఉన్నాయని కాగ్ తప్పుపట్టింది. సదరన్ డిస్కాం, నార్తన్ డిస్కాంల టర్నోవర్ 2011-12లో రూ.5433.08 కోట్లు ఉండగా, 2015-16కు రూ. 7632.13 కోట్లకు చేరింది. దాదాపు 40.48 శాతం టర్నోవర్ వృద్ధి చెందింది. కాగా 2016 మార్చి 31 నాటికి ఈ సంస్థల ఆర్థిక నష్టాలు రూ.5895 కోట్లకు పేరుకుపోయాయి. 2014-15 సంవత్సరంలో కూడా 2013-14 సంవత్సరం విద్యుత్ టారిఫ్‌ను అమలు చేయడం వల్ల కూడా ఈ నష్టాలకు కారణమని కాగ్ పేర్కొంది.
2014 నుంచి 2016 వరకు డిస్కంలు రూ. 5932.21 కోట్ల సబ్సిడీని క్లైమ్ చేయగా, ప్రభుత్వం నుంచి రూ. 5238.98 కోట్లల సబ్సిడీ వచ్చింది. దాదాపు రూ.693.23 కోట్ల సబ్సిడీ రాలేదు.
డిస్కంలు వివిధ రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి విద్యుత్ బిల్లుల బకాయిలను సక్రమంగా వసూలు చేయకపోవడంతో అవి రూ.1232 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థ నుంచి రూ. 820.89 కోట్లు, ఇతర సర్వీసుల నుంచి రూ. 249.03 కోట్ల బకాయిలు వసూలు కాలేదు. హెచ్‌టి వినియోగదారుల బకాయిలు రూ. 65.85 కోట్లు బకాయిలు వసూలు చేయాల్సి ఉంది.
కాగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా పరిణామం పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో 2011-12లో 9,22,913 వ్యవసాయ కనెక్షన్లకు 4432.63 ఎంయు విద్యుత్ సరఫరా అయితే, 2015-16 నాటికి 10,57,774 కనెక్షన్లకు 4671.95 ఎంయు విద్యుత్ సరఫరా చేశారు. వ్యవసాయ సర్వీసులకు మీటర్ లేకపోవడం వల్ల ఏ మేరకు వ్యవసాయ విద్యుత్ వినిమయం అవుతుందో తెలియని స్థితి నెలకొందని కాగ్ పేర్కొంది.