తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎందుకు నియమించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను నియమించకపోవడానికి గల కారణాలు తెలియచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. టిడిపి నేత మేడిపల్లిసత్యం దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది టి రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు గడచిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీకమిషన్‌ను ప్రభుత్వం నియమించలేదని కోర్టుకు తెలిపారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లేనని అన్నారు. ఈ అంశంపై కారణాలు తెలియచేస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వాసుపత్రుల్లో సీనియర్
సిటిజన్లకు సదుపాయాలపై నోటీసులు
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలు ప్రభుత్వాసుపత్రుల్లో సీనియర్ సిటిజన్లకు కల్పిస్తున్న సదుపాయాలపై అఫిడవిట్లను దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు న్యాయవాది డి కృష్ణమోహన్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.