తెలంగాణ

నేటి నుండి 13 వరకు బడిబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుండి 13 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారులతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదివారం సమావేశం నిర్వహించారు. సర్వశిక్షా అభియన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశంలో విద్యారంగానికి సంబంధించిన ప్రధానమైన అంశాలపై చర్చించారు. పక్కాప్రణాళికలతో విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్/ కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దిన విషయాన్ని బడిబాట సందర్భంగా ప్రజలకు వివరించారని ఆ యన కోరారు. ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో కంప్యూటర్ లాబొరేటరీలు, డిజిటల్ క్లాస్‌రూంలు ఏర్పాటు చేస్తున్నామని, పుస్తకాలను, యూనిఫాంలను ఉచితంగా అందిస్తున్నామని, తరగతిగదుల్లో మంచి ఫర్నీచర్ ఏర్పాటు చేశామని, ఈ విషయాలను ప్రజలకు వివరించాలని కోరారు. బడిబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను, అధికారులను భాగస్వామ్యం చేయాలని డిఇఓలకు సూచించారు.
పాఠశాలల్లో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు డిఇఓలంతా వారి వారి జిల్లాల్లో పాఠశాలలను స్వయంగా తనిఖీ చేసి ఏప్రిల్ 20లోగా తనకు నివేదికలను అందించాలని శ్రీహరి ఆదేశించారు. ఏప్రిల్ 15 లోగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు అందించాలని, అలాగే జూన్ 15లోగా యూనిఫాంలను అందించాలని ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరంలో అన్ని ఉన్నతపాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూంలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పరిస్థితి మరింత మెరుగుకావలసి ఉందన్నారు. మధ్యాహ్న భోజనం పథకానికి ఇక నుండి ఏనెల బిల్లును ఆ నెలలోనే చెల్లిస్తామని, వంటవాళ్ల వేతనాలను కూడా వెంటనే చెల్లిస్తామన్నారు.
రాష్ట్రంలో 8792 మంది ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఈ నియామకాల్లో జాప్యం జరుగుతోందని, అందువల్ల విద్యావాలంటీర్లను నియమించుకోవాలని డిఇఓలను కడియం కోరారు.

చిత్రం..విద్యాశాఖాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి