రాష్ట్రీయం

సెంట్రల్ వర్శిటీ అడ్మిషన్లకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 125 యుజి, పిజి, ఇంటిగ్రేటెడ్, రీసెర్చి కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈసారి 10 కొత్త కోర్సులను ప్రారంభించినట్టు యూనివర్శిటీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 37 కేంద్రాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన 10 కోర్సుల్లో 1959 సీట్లతో పాటు 39 స్పాన్సార్డ్ సీట్లు కూడా ఉన్నాయని వివరించారు. ప్రవేశపరీక్ష జూన్ 1వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకూ జరుగుతాయని వివరాలకు వర్శిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
8న పూర్వ విద్యార్థుల సమావేశం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఏప్రిల్ 8న నిర్వహించనున్నారు. చివరి సారిగా పూర్వ విద్యార్ధుల సమావేశం 2015లో జరిగింది.