తెలంగాణ

రాజన్న సన్నిధిలో బాలుడి అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ రూరల్, ఏప్రిల్ 3: రాజన్న సన్నిధానంలో 11నెలల బాలుడు కిడ్నాప్ గురవ్వడం కలకలం రేపింది. అయతే కిడ్నాప్ గురైన 15 గంటల్లోనే పోలీసులు కిడ్నాప్ ఉదంతానికి తెరదించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు- నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కురంపల్లికి చెందిన వరాల ఉమాయాదగిరిల కుమారుడు వరుణ్ తేజ తలనీలాలు సమర్పించుకుంటామని వారు రాజన్నకు మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకోడానికి ఆదివారం వారి స్వంత ఊరు నుంచి వేములవాడకు వచ్చారు. రాత్రి ఆలయ ఆవరణలో నిద్రించారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో తల్లిపక్కలో నిద్రిస్తున్న బాలుడిని గుర్తు తెలియని ఓ మహిళ ఎత్తుకొని వెళ్లింది. ఆ తర్వాత మెలుకువ వచ్చిన బాలుడి తల్లి ఉమ తన పక్కలో ఉండాల్సిన బాలుడు కనిపించకపోవడంతో ఆందోళనతో భర్త యాదగిరిని లేపి చెప్పింది. దీంతో ఇద్దరూ ఆలయ ఆవరణంతా బాలుడి కోసం కలియతిరిగారు. అయితే బాలుడి ఆచూకీ లభించకపోవడంతో వారు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తును చేస్తున్నారు.
చేధించిన పోలీసులు
వరుణ్‌తేజ కిడ్నాప్ కలకలం సృష్టించడంతో పోలీసులు కేసును ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సిఐ శ్రీనివాస్ సిసి ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. కారు నెంబర్ ఎపి23టిబి 3093 ఆధారంగా పోలీసులు తమ వేటను సాగించారు. తొలుత కారులో యాజమాని ఎవరని, తరువాత కారులో ఎవరెవరు వచ్చారో, ఎక్కడి వెళ్లారో పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. దీంతో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మికాంతపురం గ్రామంలో ఓ మహిళ వద్ద బాలుడి ఆచూకీ లభించినది. పోలీసులు వెంటనే ఆ బాలుడిని తీసుకుని, కిడ్నాప్‌కు పాల్పడిన ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.

చిత్రం..కిడ్నాప్‌కు గురైన బాలుడు