తెలంగాణ

కెసిఆర్ అవినీతిని బట్టబయలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, తన దగ్గర సిఎం కెసిఆర్ చేసిన అవినీతి చిట్టా అంతా సిద్ధంగా ఉందని, త్వరలోనే ప్రజలముందు నిరూపిస్తానని, కోర్టుల ద్వారా కూడా ఆయన అవినీతిని బట్టబయలు చేస్తానని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా పదాధికారులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ముఖ్యనేతలతో బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోనాగం మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో కెసిఆర్‌కు రాజకీయ బిక్షపెట్టిన పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తిచే యడంలో ఘోరంగా విఫలం చెందారని అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు గత మూడేళ్ల నుండి కేవలం కెసిఆర్ చేసిన ఖర్చు అంతంత మాత్రమేనని అన్నారు. 2014-15 సంవత్సరంలో రూ.280 కోట్లు, 2015-16లో రూ.259, 2016-17లో రూ.624 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఈ నిధులు కూడా గతంలో చేసిన పనులకు చెల్లింపులు చేశారే తప్పా. నూతనంగా అదనపు నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. 2015లో తాను ప్రాజెక్టుల యాత్ర చేపట్టి వెయ్యి కోట్ల నిధులు చేపట్టాలని డిమాండ్ చేస్తే దాంతో కొంత చలనం వచ్చి ఈ నిధు లైనా ఇచ్చారని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 2015 జూన్‌లో కర్వెన రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి 105 జిఓ ద్వారా పాలమూరు ప్రాజెక్టుకు రూ.35.200 కోట్లు ఖర్చు అవుతుందని, 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పిన ఘనుడు కెసిఆర్ అని, తీరా ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.65 వేల కోట్లకు తీసుకుపోయారని ఆరోపించారు. కెసిఆర్ అవినీతి రూ.60 వేల కోట్లకు దాటిందని, ఈ విషయాన్ని త్వరలోనే కాగ్ నివేదికలో తేలనుందని ఆయన వ్యాఖ్యానిం చారు. రాష్ట్రంలో ఖర్చు పెడుతున్న నిధుల విషయాన్ని కాగ్‌కు తెలపకుండా గోప్యంగా ఉంచారని, ఆ గోప్యత కెసిఆర్ మెడకు ఉచ్చుబిగించుకోనుందన్నారు.