తెలంగాణ

హైదరాబాద్‌లో 300 పడకల ఇఎస్‌ఐ ఆస్పత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: హైదరాబాద్‌లో 300 పడకల ఇఎస్‌ఐ ఆస్పత్రి, విశాఖలో 500 పడకల ఆస్పత్రులను నిర్మిస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలొ 31 జిల్లాల్లో ఇఎస్‌ఐ సేవలను విస్తరింపచేస్తామని ఆయన వెల్లడించారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జన సురక్ష వాహనాలను దత్తాత్రేయ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనాలను ప్రయోగాత్మకంగా తొలిసారి హైదరాబాద్‌లోనే ప్రారంభిస్తన్నట్టు చెప్పారు. అసంఘటిత, సంఘటిత కార్మికులు అందరికీ ఇఎస్‌ఐ చట్టాన్ని అమలుచేస్తామని అన్నారు. తమ ఆరోగ్యంపై అవగాహన లేక ప్రతి ఏడాది ఒక మిలియన్ మంది మరణిస్తున్నారని అన్నారు. ప్రమాదకర పరిశ్రమలు, చేనేత రంగంలో పనిచేస్తున్న వారు , భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులను దృష్టిలో ఉంచుకుని అనేక సంస్కరణలను తీసుకువచ్చామని అన్నారు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో మరో తొమ్మిది జన సురక్ష వాహనాలను ప్రారంభిస్తామని చెప్పారు. ఇఎస్‌ఐ ఆధ్వర్యంలోని సెంటర్లను ఆరు పడకల ఆరోగ్య కేంద్రాలుగా మారుస్తామని, 50వేల మంది కార్మికులున్న చోట 100 పడకలు, ఒక లక్ష మంది కార్మికులు ఉన్న చోట 200 పడకలు, మూడు లక్షల మంది కార్మికులు ఉన్న చోట 300 పడకలు ఐదు లక్షల మంది ఉన్న చోట 600 పడకల ఆస్పత్రులను నెలకోల్పుతామని అన్నారు.
ఇన్స్యూరెన్స్ పథకానికి సవరణలు
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్ ఇన్స్యూరెన్స్ పథకానికి సవరణలు చేపట్టినట్టు మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మార్చి 2016 నాటికి ఈ పథకంలో 18,119 కోట్ల రూపాయిలు జమ అయ్యాయని అన్నారు. అయితే ఈ పథకం కింద 2015-16 సంవత్సరానికి 253 కోట్ల కార్మికులకు చెల్లింపులు చేశామని అన్నారు. ప్రతిపాదిత పథకంలో ఎవరైనా ఈ ఏడాది చందాదారులుగా ఉండి మరణిస్తే వారికి రెండు లక్షల 50 వేల రూపాయిలు బీమా వస్తుందని అన్నారు. కనీసం 20 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుని 5వేల వేతనం పొందుతున్న వారికి 30వేలు, 10వేల వేతనం పొందేవారికి 40వేలు, 10వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న వారికి 50వేల రూపాయిలు లాయల్టీ చెల్లించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ లాయాల్టీ ప్రయోజనం కింద 20 సంవత్సరాలు సర్వీసు చేసుకున్న వారు ఏడాదికి 1.78 లక్షల మంది, ఏడాది సర్వీసు పూర్తి చేసుకునే వారు ఏటా 35వేల మంది వరకూ ఉంటున్నారని అన్నారు. 54 లక్షల మంది ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్లకు ఇఎస్‌ఐ ఆరోగ్య సేవలు అందిస్తున్నామని అన్నారు. హమాలీలు, రైల్వే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి, ఇంట్లో పనిచేసే పనిమనుషులను ఇఎస్‌ఐ పరిధిలోకి తీసుకువస్తున్నామని అన్నారు. ఈ నెల 22న హైదరాబాద్‌లో జరిగే ఒక కార్యక్రమంలో వెయ్యి మందికి ఇఎస్‌ఐ కార్డులు ఇస్తామని చెప్పారు.