హైదరాబాద్

ప్రజల్లోకి ‘ భగీరథ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: అర్భన్ భగీరథ కార్యక్రమం కింద నగరంలో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు కేవలం రూపాయికే నల్లా కనెక్షన్లను ఇస్తున్న విషయాన్ని స్వయం సహాయక బృందాలు ప్రతి ఇంటికి ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం అర్బన్ భగీరథ కార్యక్రమంపై బృందాలకు శిక్షణ శిబిరాన్ని నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివార్ల దాహర్తిని తీర్చేందుకు కొత్తగా నిర్మించతలపెట్టిన 56 రిజర్వాయర్లలో ప్రస్తుతం సిద్ధమైన 12 రిజర్వాయర్ల పరిధుల్లో 15వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ అర్బన్ భగీరథ కార్యక్రమం కింద కేవలం రూపాయికే కొత్త నల్లా కనెక్షన్‌ను ఇస్తున్నట్లు ప్రజలను చైతన్యవంతులను చేసి నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా స్వయం సహాయక బృందాలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం కింద కేవలం వారం రోజుల్లోనే వినియోగదారుడికి ఖాతా నెంబర్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో ప్రారంభించే 12 రిజర్వాయర్ల పరిధిలో మంజూరు చేయాలని భావించిన 15వేల కనెక్షన్లలో ఇప్పటికే నడిగడ్డ తండాలో 300 దరఖాస్తులొచ్చాయని, అందులో 25 కనెక్షన్లు కూడా మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. ఇంటి వద్దకు వచ్చే స్వయం సహాయక బృందాలకు చెందిన సభ్యులకే యజమానులు దరఖాస్తు సమర్పించుకోవచ్చునని తెలిపారు. కొత్త కనెక్షన్లు ఇవ్వడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే మీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలల్లో సంప్రదించాలని కూడా ఎండి ఈ సందర్భంగా సూచించారు. అలాగే స్వయం సహాయక బృందాల సభ్యులకు జలమండలి ఎండి పలు సూచనలు, సలహాలిచ్చారు. సభ్యులు ఇంటింటికి తిరిగి కొత్త నల్లా కనెక్షన్ గురించి ప్రజలకు వివరించాలన్నారు. సభ్యులు రోజుకి కనీసం 20దరఖాస్తలను స్వీకరించాలని సూచించారు. ఒక వ్యక్తి నుంచి ఒకటే దరఖాస్తు స్వీకరించాలన్నారు. ముఖ్యంగా నగర శివార్లకు చెందిన ప్రజలు ఈ స్కీం కింద త్వరగా నల్లా కనెక్షన్లు తీసుకునేలా వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఈ శిబిరంలో జలమండలి ప్రాజెక్టు-2 డైరెక్టర్ డి.శ్రీ్ధర్‌బాబు, సిజిఎంలు ఆనంద్ స్వరూప్, ప్రవీణ్‌కుమార్‌లతో పాటు జిఎంలు, మేనేజర్లు, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.