ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థులపై వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పట్ల వివక్ష కొనసాగుతోందని, దళిత, మైనార్టీ వర్గాల అణచివేతతో విద్యార్థులు అసహనానికి గురవుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, గీతారెడ్డి ఆరోపించారు. శనివారం శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌వద్ద విలేఖరులతో మాట్లాడారు. ప్రగతిశీల ప్రజాస్వామ్యంలో ప్రజలకు, విద్యార్థులకు రక్షణ లేకుండాపోతోందని, తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లే దుస్థితి నెలకొందని వారు నిశితంగా విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు మరో పోరాటానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఇటీవల హెచ్‌సియూలో పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా కలచివేసిందని ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. జాతీయ నాయకులు, మేథావులు, దేశంలోని పలు విద్యార్థి సంఘాల నాయకులు హెచ్‌సియూ సంఘటనను స్పందించి పరామర్శిస్తుంటే తెలంగాణ సిఎం కెసిఆర్ స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 22న హెచ్‌సియూలో విద్యార్థులు నిర్వహించతలపెట్టిన సభకు జెఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌ను అననుమతించకపోగా పోలీసులు ఇద్దరు ఫ్యాకల్టీలతోపాటు 27 మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని ఆమె ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని, పేద విద్యార్థులకు వర్శిటీలో చదువుకునే హక్కును హరింపజేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో దళితులు, మైనార్టీలు ముందున్న విషయాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. హెచ్‌సియూ ఘటనపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.