రాష్ట్రీయం

తగ్గిన అమెరికా వీసా దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: అమెరికాలో ఉద్యోగాల్లో పనిచేసే విదేశీ వృత్తివిద్యా నిపుణులకు జారీ చేసే హెచ్-1బి వీసా దరఖాస్తులు ఈసారి గణనీయంగా తగ్గిపోయాయి. గత కొద్ది కాలంగా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విదేశీ వృత్తివిద్యానిపుణుల నుండి వీసా కోరుతూ వచ్చిన దరఖాస్తులు తగ్గడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. రాను రాను కఠినమైన నిబంధనలను చేర్చడంతో దరఖాస్తులు తగ్గినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది వీసా కోసం 2.36 లక్షల దరఖాస్తులు రాగా, ఈ ఏడాది హెచ్-1బి వీసా కోరుతూ 1.99 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2013 నుండి వరుసగా దరఖాస్తుల సంఖ్య పెరగ్గా ఈ ఏడాది తొలిసారి దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. అమెరికాలో నిపుణులపై వివక్ష చూపరాదని, తొలి ప్రాధాన్యం వారికే ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించడంతో రిక్రూటింగ్ ఏజన్సీలు సైతం విదేశీ నిపుణులకు ప్రాధాన్యత తగ్గించే ముప్పు ఉందనే ప్రచారంతో దరఖాస్తులు తగ్గాయి. హెచ్-1బి వీసా పొందినా రాను రాను అమలులోకి వచ్చే కఠిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సి ఉంటుంది. అనిశ్చిత స్థితిలో దరఖాస్తులు తగ్గడం ఆశ్చర్యకరం కాదని అమెరికా ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ సంచాలకురాలు బెట్‌సి లారెన్స్ వ్యాఖ్యానించారు. తక్కువ నైపుణ్యం , అనుభవం ఉన్న ఉద్యోగులను భారత్‌లోని చాలా ఐటి కంపెనీలు తగ్గించుకుంటున్నాయి. వారందరినీ గతంలో అమెరికా పంపించిన ఈ సంస్థలు ఇపుడు వారికి స్వస్తి పలుకుతున్నాయి అని బెట్‌సి విశే్లషించారు. ప్రతి ఏటా అత్యధికంగా టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థల నుండే ఎక్కువ మంది నిపుణులు అమెరికా హెచ్-1బి వీసా పొందుతున్నారు. ఈ ఏడాది అమెరికా 85వేల మందికి వీసా జారీ చేయనుంది. అందులో 20వేల వీసాలు మాస్టర్స్ డిగ్రీ ఉన్న వారికి కేటాయిస్తారు.