ఆంధ్రప్రదేశ్‌

వడదెబ్బతో ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 26: వడదెబ్బ తీవ్రతతో నల్లగొండ జిల్లాలో ముగ్గురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఒకరు మరణించారు. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన పెద్దబోయిన సైదులు (55) తన వ్యవసాయబావి వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అదేవిధంగా నాగారం గ్రామానికి చెందిన తన్నోజు రామనర్సమ్మ (40) వ్యవసాయబావి వద్ద నుండి వంటచెరుకు తీసుకుని ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఆపస్మారకస్థితిలోకి వెళ్లి మృతి చెందింది. నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన అనంతు సైదమ్మ (66) వ్యవసాయ కూలికి వెళ్ళి వడదెబ్బ సోకి మృతి చెందింది. వరంగల్ జిల్లా ములుగు మండలంలోని కాసిందేవిపేట గ్రామానికి చెందిన అజ్మీరా శ్రీనివాస్ (39) అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం వరకు పనిచేశాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటికి చేరుకుని అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మంగపేట మండలంలోని నర్సింహసాగర్ గ్రామానికి చెందిన కుంట వీరమ్మ (80) అనే వృద్ధురాలు గత నాలుగు రోజులుగా విపరీతంగా ఉన్న ఎండ వేడికి అస్వస్థతకు గురైంది. శనివారం ఎండ మరింత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ సోకి మధ్యాహ్నం వీరమ్మ మృతి చెందింది. మెదక్ జిల్లా మెదక్ మండలం మాచవరం గ్రామానికి చెందిన ఆరెగూడేం పుష్పమ్మ (45) గ్రామ శివారులో గల తన వ్యవసాయ పొలానికి పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి చేరుకొని ఆనారోగ్యానికి గురికావడంతో 108లో మెదక్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.