తెలంగాణ

ఇద్దరు బాలింతలు మృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రసవాలు జరిగే హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలో గురువారం ఇద్దరు బాలింతలు మృతి చెందటం కలకలం సృష్టించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ఆరోపిస్తూ మృతుల బంధువులు ఆందోళన చేశారు. గురువారం 19 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. ఇందులో ఇద్దరు బాలింతలు చనిపోయారు. అరుణానగర్‌కు చెందిన శారద (22) ఈ నెల 18వ తేదీన ప్రసవం కోసం ఇక్కడ చేరారు. ఆమె 20న ప్రసవించారు. మొదటి ప్రసవం సమయంలో ఆమెకు ఇనె్ఫక్షన్ కూడా సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అంతేగాక, ఆమెకు అధిక రక్తపోటు ఉండటంతో సిజేరియర్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆకస్మికంగా రక్తపోటు తగ్గింది. ఈ క్రమంలో ఆమె గురువారం రాత్రి చనిపోయింది. అలాగే మరో బాలింతకు కూడా ఆపరేషన్ తరువాత ఆరోగ్యం విషమించటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించటంతో ఆమె అక్కడ మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఇద్దరు బాలింతల బంధువులు వారి మృతికి వైద్యులే కారణమని ఆందోళనకు దిగారు.
బాధ్యులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి లక్ష్మారెడ్డి
సుల్తాన్‌బజార్ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. బాలింతల మృతికి కారకులను వదిలే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. తప్పెవరిదో తేలిన తర్వాత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు డిఎంఇ రమణి, గాంధీ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్ అనుపమ ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.