తెలంగాణ

క్వింటాల్ మిర్చి 10 వేలకు అమ్మలేరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: మంత్రి కెటిఆర్ ఐస్ క్రీంను రూ.5 లక్షలకు, ఆయన సోదరి, ఎంపి కవిత ఒక గంట చీరలు అమ్మితే రూ.6 లక్షలు వస్తున్నప్పుడు ఈ ఇద్దరు ఎనుమాముల మార్కెట్‌కు వెళ్లి క్వింటాల్ మిర్చిని రూ.10 వేలకు అమ్మొచ్చుగా..? అని టిటిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబంలోని నలుగురిలో ఒకరు ఎనుమాముల మార్కెట్‌కు, మరొకరు ఖమ్మం, ఇంకొకరు తాండూరు, మరొకరు నిజామాబాద్‌కు వెళ్లి మిర్చి క్వింటాల్ రూ.10వేలు, కందులు రూ.12 వేలు, పసుపును రూ.8 వేలకు అమ్మితే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని అన్నారు. తాను చింతమడక పర్యటనకు వెళ్లినప్పుడు ఒక రైతు ఇలా కెసిఆర్ కుటుంబంలోని వారంతా ఐస్‌క్రీములు, చీరలు అమ్మినట్లే రైతు ఉత్పాదనలు అమ్మి సహకరించ వచ్చు కదా అని అడిగినట్లు రేవంత్ వివరించారు. ఒక వైపు రైతుల సమస్యలు పరిష్కారం కాకుండా గగ్గోలు పెడుతుంటే, మరోవైపు కొత్తగా రైతులకు ఉచిత ఎరువులు వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటూ కెసిఆర్ మళ్లీ రైతాంగాన్ని భ్రమల్లోకి నెడుతున్నారని విమర్శించారు. ఎప్పుడో అమలు చేయడం కాదని, ప్రస్తుతం 35 లక్షల రైతు ఖాతాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నందున ఈ ఏడాది నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు.