ఆంధ్రప్రదేశ్‌

బిజెపితో పొత్తుపై గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటర్లను కేసీఆర్ ముందే కొనేస్తున్నారు
బాబుతో తెలంగాణ తమ్ముళ్ల భేటీ
నేడు కూడా కొనసాగనున్న చర్చ

అమరావతి, ఏప్రిల్ 24: తెలంగాణలో భవిష్యత్తులో బిజెపితో పొత్తు ఉంటుందో లేదో తెలియకపోవడంతో క్యాడర్‌లో గందరగోళం నెలకొందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ టిడిపి నేతలు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కోరారు. తెలంగాణ పార్టీ నేతలు బాబుతో సోమవారం రాత్రి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉండదని, సొంతగానే పోటీ చేస్తామని బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలు, పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలను బాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఏపిలో మిత్రపక్షంగా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ తెలంగాణలో మాత్రం పొత్తు లేకపోవడం వల్ల, చెడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని వారు బాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఏదో ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని కోరగా, అది పెద్ద సమస్య కాదని బాబు తోసిపుచ్చినట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు డబ్బుతో ప్రతి ఇంటికొకరికి లబ్ధి కలిగిస్తూ, పరోక్షంగా ఇప్పటినుంచే ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని బాబు దృష్టికి తీసుకువెళ్లారు. బీసీల్లో చీలిక తెచ్చారని, మతపరమైన విభజన తీసుకురావడం ద్వారా, ఓటు బ్యాంకు పదిలం చేసుకుంటున్నారని దానిపై పోరాడతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని, ఇప్పటికే తాము ప్రభుత్వంపై వివిధ స్థాయిలో పోరాడుతున్నామని బాబుకు చెప్పారు.
మహానాడు సందర్భంగా నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సమావేశాలు, జిల్లాకో బహిరంగ సభ నిర్వహించే అంశంపై చర్చ జరిగింది. అయితే మళ్లీ గురువారం సమావేశం అవుదామని బాబు చెప్పినట్లు సమాచారం. కాగా తెలంగాణ పార్టీ నేతలకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విందు ఇచ్చారు.