తెలంగాణ

రూ. 3లక్షలకు అమ్మేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనిమనిషి వీసాపై సౌదీకి పంపారు మహిళను మోసగించిన ఏజెంట్లు
కాంట్రాక్టు పెళ్లికి ఒప్పుకోనందుకు చిత్రహింసలు పెడుతున్న ఇంటి యజమాని

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఏజెంట్ల మోసానికి మరో హైదరాబాద్ మహిళ బలైపోయింది. డబ్బుకు కక్కుర్తిపడ్డ ఏజెంట్లు సౌదీలో ఇంటి పనిమనిషిగా పంపించి, కాంట్రాక్టు పెళ్లికి ఒప్పుకోమన్నారు. పెళ్లికి నిరాకరించడంతో ఇంటి యజమాని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. తిరిగి భారత్‌కు పంపేందుకు నిరాకరిస్తున్నాడు. అంతే కాకుండా ఆ మహిళను రూ. 3 లక్షలకు అమ్మేశారని పని కుదుర్చుకున్న యజమాని ఆమెను నిర్బంధించాడు. హైదరాబాద్ ఏజెంట్లు చేసిన మోసానికి ఇప్పుడు ఆ మహిళ సౌదీలో చిత్రహింసలు ఎదుర్కొంటోంది. హైదరాబాద్‌లోని బాబానగర్ సి బ్లాక్‌కు చెందిన సల్మాబేగం (39)ను అదే ప్రాంతానికి చెందిన అక్రం, షఫీ అనే ఇద్దరు ఏజెంట్లు గత జనవరి 21న ఇంటి పనిమనిషి వీసాపై సౌదీ అరేబియా పంపారు.
పని కుదుర్చుకున్న ఇంటి యజమానికి తనను అమ్మేశారని సల్మాబేగం తన కూతురు సమీనాకు తెలియజేసింది. తన ఆరోగ్యం బాగోలేదని, తాను చిత్రహింసలకు గురవుతున్నట్టు వీడియో, ఆడియో, ఫొటోలు, ఫోన్‌ద్వారా బాధితురాలు తన కుమార్తెకు తెలిపింది. దీంతో తన తల్లిని ఏజెంట్లు అక్రం, షఫీ మోసగించారని, తన తల్లిని కాపాడాలని ఆమె కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని సమీనా మీడియాకు తెలిపింది.
సౌదీలో చిత్రహింసలకు గురవుతున్న తన తల్లిని హైదరాబాద్‌కు తీసుకురావడానికి సాయం చేయమని ఏజెంట్లు అక్రం, షఫీలను ప్రాధేయపడ్డా ఇప్పటి వరకు వారు ఏమీ చేయలేదని ఆమె తెలిపింది. తన తల్లిని ఏజెంట్లు సౌదీలోని వ్యక్తికి రూ. 3 లక్షలకు అమ్మేశారని, కొనుక్కున్న వ్యక్తితో పెళ్లికి అంగీకరించకపోవడంతో తన తల్లిని వేధిస్తున్నారని సమీనా కన్నీటి పర్యంతమైంది. ఇప్పటికైనా తన తల్లిని హైదరాబాద్‌కు రప్పించాలని ఆమె పోలీస్ ఉన్నతాధికారులను కోరింది.