తెలంగాణ

సహకార సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: వచ్చే ఖరీఫ్ నుండి సహకార సంఘాల ద్వారానే రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామని సేద్యం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ (ఆబిడ్స్)లోని తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టిఎస్‌క్యాబ్)లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, అధికారులు సేవాభావంతో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో వానాకాలంలో 40 వేల కోట్లు, యాసంగిలో 16 వేల కోట్ల రూపాయల విలువైన పంటలు పండుతున్నాయన్నారు. రాష్ట్రంలో 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ఉన్నాయన్నారు. వీటిని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ పనులకు సంబంధించి ప్యాక్స్‌కు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే టిఆర్‌ఎస్ బహిరంగ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పోచారం కోరారు. ఈ సమావేశంలో టిఎస్‌క్యాబ్ అధ్యక్షుడు కె.రవీందర్‌రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి, టిఎస్ క్యాబ్ ఎండి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.