తెలంగాణ

కలసికట్టుగా శ్రమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)పై పసుపు జెండా ఎగుర వేసేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు దృష్టి సారించారు. సంక్రాంతి పండుగ సమయంలోనే జిహెచ్‌ఎంసి పాలక మండలికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని భావించిన టి.టిడిపి నాయకులు మంగళవారం హడావిడిగా సమావేశమయ్యారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ అధ్యక్షతన పార్టీ జిహెచ్‌ఎంసి డివిజన్ల ఇన్‌ఛార్జీలు, సమన్వయకర్తలతో జరిగిన సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపితో కలిసి పనిచేయాలని, సీట్ల సర్దుబాటు విషయంలో భేదాభిప్రాయాలు లేకుండా చూసుకోవాలని భావించారు. త్వరలో బిజెపి ముఖ్య నేతలతో సమావేశమై చర్చించాలని నిర్ణయించారు.
జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 26 లేదా 28వ తేదీన నగరంలోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని వారు ఈ సందర్భంగా నిర్ణయించారు. 22వ తేదీన జిహెచ్‌ఎంసి పరిథిలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలు ఎగుర వేసి జెండా పండుగలు నిర్వహించనున్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలకూ ఒక ఎన్నికల ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నందున, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి రోజూ రెండు జిల్లాల కమిటీలతో, ముఖ్య నేతలతో సమావేశం కావాలని నిర్ణయించామని టి.టిడిఎల్‌పి ఇన్‌ఛార్జీ అమర్‌నాథ్ బాబు తెలిపారు.
17న నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు, 18న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై పార్టీ పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తారని ఆయన తెలిపారు. 19న కూన వెంకటేష్ గౌడ్ ఏర్పాటు చేయనున్న క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

తాగునీటి కార్పొరేషన్ ఎండిగా ఎస్‌పి సింగ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 15:తెలంగాణ రాష్ట్ర తాగునీటి కార్పొరేషన్ ఎండిగా ఎస్‌పి సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయితీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌పి సింగ్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
మిషన్ భగీరథ పథకానికి నిధులు సమకూర్చుకోవడం కోసం ప్రభుత్వం తాగునీటి కార్పొరేషన్‌కు రూపకల్పన చేసింది. మిషన్ భగీరథ పథకం పనులను ఎస్‌పి సింగ్ పర్యవేక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద తొలి విడత తొమ్మిది నియోజక వర్గాల్లోని గ్రామాలకు తాగునీటిని అందంచనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

వామనావతారంలో రామయ్య దర్శనం

భద్రాచలం, డిసెంబర్ 15: అధ్యయనోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి మంగళవారం భక్తులకు వామనావతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామికి వేదపండితులు నాళాయర దివ్యప్రబంధం, ద్రవిడ ప్రబంధం పారాయణం చేశా రు. వేదవిన్నపాలు చేశారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామి మిథిలాస్టేడియానికి చేరుకుని భక్తులకు దర్శనం ఇచ్చారు. తిరుమాడవీధుల్లో తిరువీధి సేవ చేశారు. గోవిందరాజస్వామి ఆలయంలో పూజలందుకున్న స్వామి తిరిగి ఆలయానికి చేరుకున్నారు.

వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య