తెలంగాణ

పోలీసు దిగ్బంధనంలో ఖమ్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 29: మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ జరుగుతున్న ఆందోళనలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడంతో శనివారం ఖమ్మం జిల్లాలో పోలీసుల నిర్బంధం కొనసాగింది. జిల్లాలోకి వచ్చిన పార్టీల నేతలను వారి కార్యాలయాల నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొంత మందిని జిల్లా సరిహద్దులోనే అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. శుక్రవారం రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ముందస్తుగా శనివారం ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా 144సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఇక్బాల్ ప్రకటించారు. ఈ క్రమంలో దాన్ని పట్టించుకోకుండా అన్ని రాజకీయ పక్షాలు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అయితే ఆయా రాజకీయ పార్టీల నేతలు తమ పార్టీ కార్యాలయాల నుంచి బయటకు రాగానే పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావుల నేతృత్వంలో ఆయా పార్టీలు తమ కార్యాలయాల నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనలు నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక్కో రాజకీయ పార్టీ నేతలను ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆందోళనలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నప్పటికీ పోలీస్ నిర్బంధానికి తోడు తన సోదరుని కుమార్తె మరణించిందనే సమాచారం రావడంతో తిరిగి వెళ్ళారు. ఖమ్మం వస్తున్న టిడిపి నేత రేవూరి ప్రకాశరెడ్డిని నేలకొండపల్లిలోనూ, బిజెపి నేత మధుసూదన్‌రెడ్డిని కూసుమంచిలోనూ అదుపులోకి తీసుకొని వెనుకకు పంపించివేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తమ పార్టీల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా పార్టీల అనుబంధ సంఘాల నేతలు నిరసనలు తెలిపారు. కాగా ఖమ్మం వ్యవసాయమార్కెట్‌లో శనివారం కొనుగోళ్లు పోలీసుల నిర్బంధం మధ్య కొనసాగాయి. ఉదయమే మార్కెట్‌కు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు ఇతర రాజకీయ పార్టీలు నేతలను వెనుకకు పంపించారు. మార్కెట్‌లోకి రాజకీయ పార్టీల నేతలను అనుమతించవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినందునే వారిని పంపించి వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు రైతుల వద్ద ఉన్న పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులతో మార్కెట్ చైర్మన్ కృష్ణ జరిపిన చర్చలు సఫలీకృతం అవడంతో ధర తగ్గినప్పటికీ మిర్చి కొనుగోళ్ళు మాత్రం యథావిధిగా కొనసాగాయి. గిట్టుబాటు ధర కల్పించకపోగా ఆందోళనలు చేస్తున్న నేతలను నిర్బంధించడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 30న అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, మే 2న జిల్లా దిగ్బంధనం, 15న ఛలో హైదరాబాద్ చేపట్టనున్నట్లు తెలిపారు.