తెలంగాణ

చర్చించకుండా ఆమోదం సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఏప్రిల్ 30: అతి ముఖ్యమైన భూసేకరణ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లుపై ఎలాంటి చర్చజరపకుండా కేవలం ఐదు నిమిషాల్లో ఆమోదించి సభను ముగించడం సిగ్గుచేటని కాంగ్రెస్ శాసనసభ పక్షం మండిపడింది. అసెంబ్లీ జరిగిన తీరు బాధాకరమని పేర్కొంది. యావత్ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన బిల్లును ముఖ్యమంత్రి సైతం లేకుండా ఆమోదించుకోవడం ఏమిటని సిఎల్‌పి నేత జానారెడ్డి నిలదీశారు. రైతుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే బిల్లుపై సుదీర్ఘంగా చర్చజరుపుతారని తాము భావించామని, అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ప్రతిపక్షంగా తాము ప్రజల వెంట ఉంటూ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నామని చెప్పారు. ఎక్కడాలేని విధంగా ఆదివారాల్లో సభను నిర్వహిస్తున్నా తాము ప్రజలకు న్యాయం జరగాలని పాల్గొనేందుకు సిద్ధపడ్డా ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతు సమస్యలు తీవ్రతరం అయ్యాయని, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తాము మిర్చిరైతుల విషయం చర్చించాలని బిఎసిలో కోరినా ససేమిరా అన్న ప్రభుత్వం భూసేకరణపై కూడా చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య, రైతు వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులు ఈ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి తగిన బుద్ధి చెప్పేందుకు తమతో కలిసి రావాలని కోరారు.
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ: ఆర్.కృష్ణయ్య
అసెంబ్లీని ఆరు నిమిషాల్లో ముగించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆర్.కృష్ణయ్య అన్నారు. అన్నదాతల విషయంలో చర్చ అర్ధవంతంగా, వారికి న్యాయం జరిగేలా జరుగుతుందని భావించానని అందుకు విరుద్ధంగా సభలో సిఎం కూడా లేకుండా ఆమోదించుకున్నారని మండిపడ్డారు. లోతైన చర్చ జరగకుండా తీసుకువచ్చిన చట్టాన్ని కేంద్రం నిలిపివేయాలని కోరుతామని చెప్పారు. అన్ని ధరలు పెంచుతున్న ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ధరను రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు.