తెలంగాణ

మరో నాలుగు ఫుడ్‌పార్క్‌లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: మెగా ఫుడ్‌పార్క్ పాలసీలో భాగంగా తెలంగాణకు కొత్తగా నాలుగు ఫుడ్‌పార్క్‌లను మంజూరు చేయాలని కేంద్రానికి మంత్రి కె తారక రామారావు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, మనోజ్ సిన్హాలతో సమావేశం అయ్యారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ విలేఖరులతో మాట్లాడుతూ ముందుగా టెలికాం సహాయ మంత్రి మనోజ్ సిన్హాను కలిసి టీ-ఫైబర్ పథకం కోసం నిధులను తెలంగాణకు విడుదల చేయాలని కోరినట్లు వెల్లడించారు. తెలంగాణలోని కోటి ఇండ్లకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించేందుకు వీలుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ముందుగానే ఈ పథకానికి నిధులు మంజూరు చేస్తే తెలంగాణకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మంత్రికి వివరించామన్నారు. అయితే ముందుగా నిధుల మంజూరుకు తమ మంత్రిత్వ శాఖకు కొన్ని పరిమితులున్నాయని కేంద్రమంత్రి వెల్లడించారని చెప్పారు. ఈ విషయంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కలివాల్సిందిగా సూచించినట్టు కెటిఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపుతామని కేంద్రమంత్రి చెప్పారని కెటిఆర్ తెలిపారు. అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్‌ను కలిసి మెగా ఫుడ్‌పార్క్‌ల పాలసీలో భాగంగా తెలంగాణకు కొత్తగా నాలుగు ఫుడ్ పార్క్‌లను మంజూరు చేయాలని కోరినట్టు వివరించారు. ఇప్పటికే తెలంగాణకు కేటాయించిన ఫుడ్‌పార్క్‌లను ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఫుడ్ పార్క్‌ల ఏర్పాటు పక్రియను వేగవంతం చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు చెప్పారు. అలాగే సిరిసిల్లలో కోల్డ్‌స్టోరేజీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రమంత్రిని కోరారు.
రోడ్ల అభివృద్ధికి రూ. 1700 కోట్లు ఇవ్వండి
అనంతరం కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీని కలిసినట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రహదారులకు సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని ఉప్పల్- ఘట్‌కేసర్, ఆరంఘడ్-శంషాబాద్, ఇతర మార్గాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.1700 కోట్లు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. అలాగే మహబూబ్ నగర్-జడ్చర్ల మార్గంలో నిలిచిపోయిన 7 కిలో మీటర్ల మేరకు నాలుగు లేన్ల రహదారికి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రిని కోరినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి మంత్రి హామి ఇచ్చినట్టు తెలిపారు.
ఐటిఐఆర్‌ను మంజూరు చేయండి
అనంతరం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమై తెలంగాణ ఐటి అభివృద్ధిపై ఆయనతో చర్చించినట్టు కెటిఆర్ తెలిపారు. గతంలో యుపిఏ ప్రభుత్వం తెలంగాణకు ఐటిఐఆర్‌ను ప్రకటించి మంజూరు చేయకుండానే దిగిపోయిందని, ప్రస్తుతం దీనిపై కేంద్రం దృష్టి సారించాలని కోరినట్టు చెప్పారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ మాన్యుఫాక్చరింగ్ వంటి విభాగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను కేంద్రం ప్రోత్సహించాలని కోరినట్టు తెలిపారు. అలాగే టీ వర్క్స్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రిని ఆహ్వానించినట్టు పేర్కొన్నారు.
ఖమ్మం ఘటన కాంగ్రెస్, టిడిపిల పనే
ఏ రైతు కూడా అన్నంపెట్టే మార్కెట్ యార్డును తగులబెట్టరని, రైతుల రూపంలో ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ ఘటనకు ఒడిగట్టారని కెటిఆర్ మండిపడ్డారు. రైతుల రూపంలో వచ్చి రైతులకు, ప్రభుత్వానికి మధ్య చిచ్చు పెట్టేందుకే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వానికి ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేక, అసూయతో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు. రైతులకు తమ ప్రభుత్వం 17 వేల కోట్లు రుణ మాఫీ చేసిందని, రైతులకు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని కెటిఆర్ అన్నారు.

చిత్రం..సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్‌తో సమావేశమైన మంత్రి కెటిఆర్