తెలంగాణ

జేబులు నింపుకొనేందుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మార్చి 27: మిషన్‌కాకతీయ పథకం అధికార పార్టీ నాయకుల జేబులు నింపేందుకు ఉపయోగపడుతోందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని రాజీవ్ స్మారక భవన్‌లో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగు, తాగునీటి ప్రాజెక్టులు టిఆర్‌ఎస్ నాయకుల జేబులు నింపుకొనేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్పా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఒక పక్క చెర్వుల్లో మట్టిని అమ్ముకుంట మరో పక్కన మిషన్‌కాకతీయలో బిల్లులు తీసుకుంటున్నారని విమర్శించారు. మిషన్‌కాకతీయ అధికార పార్టీ నేతల అవినీతి, అధికారుల నిర్లక్ష్యంతో ఆశించిన ఫలితాలివ్వడంలేదన్నారు. నిధుల దుర్వినియోగం తప్పా పనులు సక్రమంగా సాగడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటిని అందించేందుకు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఎక్కడికక్కడ కమీషన్‌లు దండుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగుతాగు నీటి ప్రాజెక్టులను గత కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్న ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. భారీ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినవేనని గుర్తుచేశారు. అప్పటి ప్రాజెక్టులతోనే నేడు తెలుగు రాష్ట్రాలకు సాగుతాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. పిలాయిపల్లి కాలువ పనుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతుందన్నారు. పిలాయిపల్లి కాలువ ద్వారా మొదటి గ్రామాలలోని చెరువులు, కుంటల్లోకి నీటిని నింపకుండా దిగువకు తీసుకుపోవడం సరికాదన్నారు. కాలువకు అడ్డకట్ట వేసి మూసీ జలాలను చెరువులు, కుంటల్లోకి మళ్లించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిసిసి ప్రధాన కార్యదర్శి గుండు మల్లయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.