తెలంగాణ

‘విజయ’ రైతులకే రాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: విజయ డైరీని ప్రోత్సహించి, బలోపేతం చేయడానికే దానికి పాలుపోసే రైతులకు లీటర్‌కు నాలుగు రూపాయాల చొప్పున ధర పెంచినట్టు వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. పెంచిన ధర మేరకు విజయడైరీకి రూ.16 కోట్ల 30 లక్షలు విడుదల చేశామని, ఈనెలాఖరు వరకు రైతులకు సంబంధించిన బకాయిలన్నీ చెల్లించనున్నట్టు మంత్రి చెప్పారు. విజయడైరీకి పాలుపోసే రైతులకు ఇచ్చిన విధంగానే ప్రైవేట్ డైరీలకు పాలు పోసే రైతులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని పాలకపక్ష సభ్యుడు చెన్నమనేని రమేష్ సూచించారు. ప్రభుత్వ డైరీ ప్రోత్సహానికి ఇచ్చే రాయితీలను ప్రైవేట్ డైరీలకు ఇచ్చే యోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. విజయడైరీ పాల పోసే రైతులకు లీటర్‌కు నాలుగు రూపాయల ధర పెంచిన తర్వాత దాని సామర్ధ్యం నాలుగు లక్షల లీటర్ల నుంచి ఆరు లక్షల లీటర్లకు పెరిగిందన్నారు. డిమాండ్‌కు మించి రైతుల నుంచి పాలు రావడం వల్ల వాటితో పాల ఫౌడర్ తయారు చేయాల్సి వస్తుందని, దీని వల్ల విజయడైరీకి నష్టం వాటిల్లుతుందని మంత్రి పోచారం మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైతులకు పశుగ్రాసం కోసం 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు సరఫరా చేస్తున్నామని, అలాగే పశువైద్యశాలలో మందుల కోసం 16 కోట్లు కేటాయించినట్టు మంత్రి చెప్పారు. వచ్చే నెల నుంచి సంచార పశువైద్యశాలలు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. స్ర్తినిధి ద్వారా మహిళ రైతులను ప్రోత్సహించడానికి గేదెల కొనుగోలుకు రూ. 50 వేల సబ్సిడీని ఇస్తున్నామని మంత్రి పోచారం వివరించారు. గత కాంగ్రెస్ హయాంలో విజయడైరీ పాల ధరను పెంచాలని రైతులు దశాబ్దకాలం నుంచి డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లీటర్‌కు రూ. 4 పెంచిందని మంత్రి గుర్తు చేశారు.