తెలంగాణ

హెచ్‌సియు విసీని రీకాల్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 27: హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావును రీకాల్ చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ నగరంలోని హన్మకొండ అంబేద్కర్ భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వెంటనే విధులకు హాజరుకావడం విద్యార్థులకు ఆగ్రహాన్ని తెప్పించే విషయమన్నారు. ఒక సంఘటన జరిగిన తరువాత దాని పూర్వాపరాలు, నిజ నిర్ధారణ జరిగేంత వరకు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయంలో వ్యవస్థీకృత హత్యలు జరుగుతున్నాయని, దానికి వైస్ చాన్స్‌లరే కారణమన్నారు. పోలీసులు సమర్పించిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా అప్పారావును నిందితుడిగా చూపించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వమే కావాలని ప్రొఫెసర్ అప్పారావును పంపించి విశ్వవిద్యాలయంలో శాంతిలేకుండా చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల్లో కుల, మత వివక్ష అనేది ఉండకూడదని, కానీ దురదృష్టవశాత్తు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అన్ని కుల, మత వ్యవస్థలతోనే ముందుకు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.