తెలంగాణ

మిర్చి రైతును ముంచిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: మిర్చి మద్దతు ధరపై బిజెపి నాయకులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బదులు గల్లీల్లో రాద్ధంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతును నట్టేట ముంచిందని విమర్శించారు. ఖమ్మం మార్కెట్‌లో కొన్ని పార్టీలు చేసిన కుట్రలో మేం పాల్గొనలేకపోయామనే బాధతో ఏదో చేయాలని బిజెపి నాయకులు మిర్చి కొనుగొళ్లు సాఫీగా సాగుతున్న మార్కెట్ల వద్ద చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి నుంచి దత్తాత్రేయ వరకు బిజెపి నాయకులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం మిర్చి మద్దతు ధర ప్రకటించిన మరుసటి రోజే మంత్రి హరీశ్‌రావు ఆ ప్రకటనలో డొల్లతనాన్ని బయటపెట్టారని గుర్తు చేశారు. బెస్ట్ క్వాలిటీ మిర్చికి మాత్రమే ఐదువేల రూపాయల మద్దతు ధర ప్రకటించారని, నిజానికి మార్కెట్‌లో బెస్ట్ క్వాలిటీకి ఇంతకన్నా ఎక్కువ ధర లభిస్తోందని చెప్పారు. అందులోనూ మూడు లక్షల 37వేల క్వింటాళ్లను మాత్రమే కొంటామని అనడం హాస్యాస్పదం అని విమర్శించారు. మిర్చి కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదని బిజెపి నాయకులు ప్రశ్నించడం వారి అజ్ఞానానికి నిదర్శనం అని వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లో మార్కెట్లు ఖుల్లాగా ఉన్నాయని అన్నారు. ఈసారి మిర్చి పంట 70లక్షల క్వింటాళ్లు వచ్చిందని, ఇప్పటికే 38నుంచి 40లక్షల క్వింటాళ్లు రైతులు అమ్ముకున్నారని చెప్పారు. క్వింటాలుకు ఏడువేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని, మొత్తం మిర్చి కొనేందుకు గ్రాంటు రూపంలో రాష్ట్రానికి నిధులు విడల చేయాలని, అలా కాని పక్షంలో నాఫెడ్ ద్వారా కొనుగొలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరిందని తెలిపారు. రాష్ట్రంలో శీతల గిడ్డంగులు ఖాళీగా లేనందున కేంద్రం చొరవ తీసుకుని పక్క రాష్ట్రాల్లోని శీతల గిడ్డంగుల్లో పంటను భద్రపరుచుకునే వెసులు బాటు కల్పించాలని కోరారు. మిర్చి కొనుగోళ్ల అంశంపై బిజెపి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

రూ.50లక్షలతో చేపల మార్కెట్

అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు
చేపలు పట్టేవారంతా గంగ పుత్రులే
కుల వృత్తులపై ఏర్పాటు చేసిన
క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం

హైదరాబాద్, మే 9: చేపలు పట్టడం వృత్తిగా చేసుకున్న వారందరినీ గంగ పుత్రులుగా పరిగణించాలని మంగళవారం జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. కులవృత్తుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ మంగళవారం సమావేశమైంది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తన్నీరు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం వివరాలను తలసాని, మీడియాకు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో గంగ పుత్రులు చేపలు పడుతున్నారని, కొన్ని జిల్లాల్లో బెస్తవాళ్లు ఈ వృత్తిలో ఉన్నారని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని చేపలు పట్టే వృత్తిలో ఉన్న వారందరినీ గంగ పుత్రులుగా గుర్తించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
మత్స్యకారులకు ఉపాధి, మార్కెటింగ్ సొసైటీల ఏర్పాటు, సభ్యత్వం వంటి అంశాలపై చర్చించారు. మత్స్యకారులు అంటే గతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఉంటారనే అభిప్రాయం ఉండేదని తెలంగాణ ఏర్పడిన తరువాత మత్స్యకారులతో సహా గొల్ల, కురమ, చేనేత, ఇతర కుల వృత్తులపై ఆధారపడిన వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సిఎం భావిస్తున్నట్టు తలసాని తెలిపారు. మత్స్యకారుల్లో గంగ పుత్రులు, ముదిరాజ్, గూండ్ల వంటి కులాలు ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో గంగ పుత్రులు లేరని ముదిరాజ్ కులస్తులే చేపలు పట్టే వృత్తిని చేస్తున్నారన్నారు. కొన్ని జిల్లాల్లో కేవలం గంగ పుత్రులే ఈ పని చేస్తారని చెప్పారు. చేపలు పట్టే వృత్తిలో ఉన్న వారంతా గంగ పుత్రులే అనే అభిప్రాయంతో ముందుకు వెళతామని అన్నారు. సమైక్య రాష్ట్రంలో మత్స్యకారులకు 50 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు తెలంగాణలోనే వంద కోట్లు కేటాయించినట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా ప్రతి జిల్లా కేంద్రంలో 50లక్షల వ్యయంతో చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి నదుల ద్వారా వచ్చే జలాలపై చేపలు పట్టే పూర్తి హక్కులు గంగ పుత్రులకే కల్పించనున్నట్టు తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి 119 బిసి గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తున్నందున మత్స్యకారులు తమ పిల్లలను వీటిలో చదివించాలని కోరారు.