తెలంగాణ

వడదెబ్బతో నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ / కరీంనగర్, మార్చి 27: ఎండలు ఠారెత్తిస్తున్నాయ. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట వడదెబ్బకు గురై జనం ప్రాణాలు వదులుతున్నారు. నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో నలుగురు వడదెబ్బకు అస్వస్థతకు గురై మరణించారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన రమావత్ బాల (45) పశువులను మేపడానికి వెళ్లి.. వడదెబ్బకు గురికాగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా శనివారం రాత్రి మరణించాడు. ఇదే జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామానికి చెందిన శ్రీను(42) అనే నాయా బ్రాహ్మణుడు వృత్తి పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వడదెబ్బకు అస్వస్థతకు గురై మరణించాడు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన గూడెల్లి రాజమల్లు (70) అనే వృద్ధుడు వడదెబ్బతో మృతిచెందాడు. ఇదే జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామానికి చెందిన పరికిపండ్ల బిందుశ్రీ (4) అనే చిన్నారి కూడా వడదెబ్బతో మృతి చెందింది.