తెలంగాణ

మరో వారం మండే ఎండలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: రాష్ట్రంలో రానున్న వారం రోజుల్లో ఎండలు ముదిరే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని ప్రభుత్వ వాతావరణ శాఖ విశే్లషణ విభాగం వెల్లడించింది. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు, మిగిలిన ప్రాంతాల్లో 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీలకు చేరుకుంటుందని స్పష్టం చేసింది. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతూ వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు ఒకటి రెండు రోజులు తగ్గినా, తర్వాత పెరుగుతూ వచ్చాయి. నిర్మల్, జగిత్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్-్భపాలపల్లి జిల్లాల్లో 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. ఈ నెల 6వ తేదీన గరిష్టంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లా భోరజ్ ప్రాంతంలో నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.