తెలంగాణ

బీసీ హాస్టళ్లకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: వెనుకబడిన తరగతుల హాస్టళ్లను దశల వారీగా గురుకుల పాఠశాలలుగా మార్చబోతున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న వెల్లడించారు. శాసనసభలో ఆదివారం బిసి సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో టిడిపి సభ్యులు ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి జోగురామన్న సమాధానం ఇస్తూ, రాష్ట్రంలో దశల వారిగా బిసి హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మార్చుతున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక బిసి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఈ ఏడాది కొత్తగా నాలుగు గురుకుల పాఠశాలు, 3 జూనియర్ కళాశాలలు, ఒక మహిళా కళాశాలను ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి చెప్పారు. మొదటి దశలో 20 గురుకుల పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలు ఏర్పాటు చేస్తామన్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో బిసి విద్యార్థులు ముందంజలో ఉన్నారని మంత్రి వివరించారు. బిసి హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ త్వరలో భర్తీ చేస్తామన్నారు. బిసిలలో సంచార జాతుల సంక్షేమం కోసం సమాఖ్య ఏర్పాటు చేసి బడ్జెట్‌లో రూ. 5 కోట్లు కేటాయించినట్టు మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రమే పరిమితం చేసిన కళ్యాణలక్ష్మి పథకాన్ని బిసి వర్గాలకు కూడా వర్తింప చేస్తూ బడ్జెట్‌లో రూ. 300 కోట్లు కేటాయించినట్టు మంత్రి జోగురామన్న వివరించారు. సంచార జాతుల సమాఖ్యకు కేటాయించిన రూ. 5 కోట్లు ఏమూలకు కూడా సరిపోవని టిడిపి సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. సమగ్ర సర్వేలో రాష్ట్రంలో బిసిల జనాభా 52 శాతం ఉన్నట్టు తేలినప్పటికీ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు మాత్రం ఆ మేరకు లేదని ఆయన అన్నారు. బిసి విద్యార్థుల కోసం రాష్టవ్య్రాప్తంగా 300 హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యపై పెట్టే ఖర్చును పెట్టుబడిగా పరిగణించాలి తప్ప ఖర్చు భావించవద్దని ఆయన సూచించారు. ఫీజు రియింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టిన తర్వాతనే బిసి వర్గాలకు చెందిన పేద పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే స్థాయికి చేరుకున్నారని కృష్ణయ్య అభినందించారు.

అల్లుడిపై మామ గొడ్డలివేటు!
కమలాపూర్, మార్చి 27: డబ్బుల విషయంలో వచ్చిన గొడవతో అల్లుడిని మామ గొడ్డలితో నరికి చంపిన మామ కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. గుడాల రాజిరెడ్డి గత కొన్ని సంవత్సరాల క్రితం అల్లుడు మహేందర్ రెడ్డిని ఇల్లరికం తీసుకొచ్చాడు. మహేందర్ రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొంత కాలం నుండి మామ రాజిరెడ్డికి, అల్లుడు మహేందర్ రెడ్డితో డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. డబ్బులు కావాలని, వడ్డీలకు నడుపుతున్నావని, ఇవ్వమంటే ఇవ్వడం లేదంటూ కక్ష కట్టి శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మహేందర్ రెడ్డి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో రాజిరెడ్డి గొడ్డలితో తలపై నరికాడు. తీవ్రంగా గాయపడిన మహేందర్‌రెడ్డిని 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుఝామున మృతి చెందినట్లు, మృతుని సోదరుడు రవీందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు.