తెలంగాణ

మండలిలో ఐదు బిల్లులకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1లో 49, గ్రూప్-2లో 438 ఖాళీలను భర్తీ చేయడానికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుమతిచ్చిందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం తెలంగాణ శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో బిజెపి సభ్యుడు ఎన్.రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మట్లాడుతూ లక్షా ఏడు వేల ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు 11వేల ఖాళీలు ఉన్నాయని, వీటిని ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేస్తామని మంత్రి ఈటల స్పష్టం చేశారు.
ప్రతిపక్ష పార్టీ సభ్యులు మహ్మద్ అలీషబ్బీర్, ఎం.రంగారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు సభలో ప్రాణహిత-చేవెళ్ల నీటి పారుదల ప్రాజెక్టు పునరాకృతి, ప్రాజెక్టుపై ఇప్పటివరకు చేసిన వ్యయం వివరాలు, ప్రాజెక్ట్‌కు జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించే ప్రతిపాదన ఉన్నదా అన్న అంశంపై వచ్చిన ప్రశ్నపై దాదాపు 45 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ ఆర్థిక సంస్థలు వడ్డీ వ్యాపారస్తులచే అనేక మంది పేద రైతులు పీడింపబడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పొంగులేటి సుధాకర్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ సమాధానం చెప్పారు. మనీ ల్యాండరింగ్ చట్టాన్ని తీసుకువచ్చి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాల్‌మనీ కేసులు నమోదు అవుతున్నాయని, మనీ ల్యాండరింగ్, ప్రయివేట్ ఫైనాన్షియర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో దేవాలయ భూములకు పట్టాపాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ జారీ, సమగ్ర భూ సర్వే నిర్వహణ, నిజామాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య, సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం, గిరిజనలపై అత్యాచారాలు, రహదారులపై మద్యం దుకాణాలు అన్న అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు నాయినీ నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, చందులాల్, పద్మారావు, హరీష్‌రావు, ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీలు సమాధానాలిచ్చారు. సభలో మున్సిపల్ మంత్రి ప్రతిపాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ యాక్ట్‌కు సంబంధించిన రెండు బిల్లులు, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపాధించిన వ్యాట్‌కు సంబంధించిన మూడు బిల్లులను తెలంగాణ శాసనమండలి అమోదం తెలిపిందని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.