తెలంగాణ

క్రమబద్ధీ క‘రణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 14: ప్రభుత్వ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న అధ్యాపకుల క్రమబద్దీకరణ వివాదంగా మారుతోంది. తప్పుడు దృవీకరణ పత్రాలతో విధుల్లో చేరిన వారిని, ఎలాంటి పరిశీలనలు జరపకుండానే క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటంతో, దీనిని నిరసిస్తూ కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు లోకాయుక్తను ఆశ్రయించగా, విషయం వెలుగులోనికి వచ్చింది. దీనిపై జూన్ 20న విచారించనున్నట్టు లోకాయుక్త ప్రకటించగా, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో తమకు నౌకరీ రాబోతుందనే దర్పాన్ని ప్రదర్శిస్తున్న వారి గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 2వేల మందికిపైగా ఈవిధంగా ఉద్యోగాలు వెలగబెడుతుండగా, ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 50మందికి పైగా ఉన్నట్టు అధికార వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఉన్న అధ్యాపకుల కొరత దృ ష్ట్యా ఒప్పంద ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే, అప్పట్లో ఎక్కువ మంది విముఖత చూపగా, కొంతమంది ప్రభుత్వం నిషేధించిన ఇతర రాష్ట్రాలకు చెందిన పలు విశ్వవిద్యాలయాల పేర తప్పు డు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, వాటితో విధుల్లో చేరారు.
ఉమ్మడి రాష్ట్రంలో 3700వరకు ఇంటర్మీడియట్ పోస్టులు, 1100వర కు డిగ్రీ లెక్చరర్ల పోస్టు ల్లో నకిలీలనే కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసినట్లు ఆరోపణలున్నాయి. అధికారులు ఏటా వారినే తిరిగి పునరుద్ధరిస్తుండగా, ఏళ్ళ తరబడి అలాగే కొనసాగుతున్నారు. ప్రత్యేక ఉద్యమ అనంతరం నూతన రాష్ట్రంలో వీరిని క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయిస్తూ, ఇందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించటంతో నకిలీల భాగోతం తెరమీదకొచ్చింది. ఒప్పంద అధ్యాపకుల నియామకం కోసం విద్యా సంవత్సర వారీగా నోటిఫికేషన్‌లు విడుదల చేయాల్సిన సంబంధితాధికారులు గుట్టుచప్పుడు కాకుండా పాతవారినే భర్తీ చేయటం పట్ల గతంలోనే పెద్ద దుమారం చెలరేగింది. అప్పటి ప్రభుత్వం దీనిపై సీరియస్‌గానే స్పందించినా, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు రాలేదు. అధికారులు యధావిధిగా తమకు తాయిలాలు ఇచ్చినవారినే నియమించినా, జోన్‌లు మార్చి అవకాశం కల్పించారు.
తాజాగా తెరాస ప్రభుత్వం వారినే క్రమబద్ధీకరించేందుకు సన్నాహాలు చేస్తుండగా, మరోసారి అనర్హులకే అవకాశాలిస్తున్నారంటూ నిరుద్యోగ అభ్యర్థులు లోకాయుక్త కడప తొక్కటంతో, క్రమబద్ధీకరణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.