తెలంగాణ

ఒంటరి పోరాటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జర్నలిస్టు సంఘం టిజెయు ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పొత్తులకూ తెలంగాణ భాజపాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అట్టడుగువర్గాల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ పరితపిస్తున్నారని, దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో అమిత్‌షా మూడు రోజల పర్యటన తమకు కలిసి వస్తుందని చెప్పారు. పల్లెపల్లెకూ భాజపా...ఇంటింటికీ మోదీ నినాదంతో జనంలోకి వెళ్తామన్నారు. 2019లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో చేరువ చేస్తామని ఇందుకు అమిత్‌షా పర్యటనను ఉపయోగించుకుంటామని అన్నారు. నల్గొండ జిల్లాలో అమిత్‌షా పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలతోనూ, పెరోళ్లపల్లి , గొండ్రాలపాలెం గ్రామంలో కార్యకర్తలతోనూ, నాయకులతోనూ వేర్వేరుగా మాట్లాడతారని, చేనేత కార్మికులతోనూ అమిత్‌షా పర్యటిస్తారని పేర్కొన్నారు. అమిత్‌షా పర్యటన కార్యకర్తల్లో భరోసా కల్పించడంతో పాటు ప్రజల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోందని, తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఢిల్లీ నుండి గల్లీ వరకూ నిధులు అందుతున్నాయో లేదో పథకాల తీరుతెన్నులు, పార్టీ పరిస్థితి, సభ్యత్వం, దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు చేయడం వంటి అంశాల్లో అమిత్‌షా పాల్గొంటారని అన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పాలనపై రైతులు,నిరుద్యోగులు నిరాశతో ఉన్నారని , తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియాలో సిఎం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందంటే పాలన ఎలా ఉందో అర్ధం అవుతుందని అన్నారు. ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతే, టిడిపి తన ఉనికిని ప్రదర్శించలేకపోతోందని, బిజెపి మాత్రమే ప్రజల్లో ఉత్సాహాన్ని అందిస్తోందని చెప్పారు. బిజెపికి ముస్లింల మద్దతు కూడా ఉందని ఆయన తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో మైనార్టీల సహకారంతో గెలిచినట్టే తెలంగాణలోనూ గెలుస్తామని పేర్కొన్నారు. మోదీ నిర్ణయాలను సామాన్యులు సైతం సొంతం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో ప్రధాని పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న అతి పేదవారికి ఆర్థిక ఫలాలు అందించాలనే భావనతో ప్రధాని ఉన్నారని, ప్రజలు అందరూ ప్రధానిని సంతోషంగా సొంతం చేసుకుంటున్నారని తెలిపారు. అన్ని రకాల వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రధాని పనిచేస్తున్నారని, ఇంతవరకూ ప్రధాని 93పథకాలను ప్రవేశపెట్టారని, కులం, మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ పథకాలు చేపట్టారని లక్ష్మణ్ చెప్పారు.