తెలంగాణ

ముందుంది భారీ మేళా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, అందులో డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలు సేకరించే పనిని ఉన్నతాధికారులు వేగవంతం చేశారు. మొత్తం ఖాళీల్లో పదోన్నతులు ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు, డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను గుర్తించి, రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు రూపొందిస్తున్నారు. మొత్తం పోస్టుల్లో తక్షణం పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా తొలిదశలో ఎన్ని పోస్టు లు భర్తీ చేయాలనే అంశంపైనా కసరత్తు నడుస్తోంది. లెక్కల ప్రకారం 30శాతం పోస్టులు డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సివున్నా, నాలుగైదేళ్ల వరకూ ఉన్న గణాంకాల్లో అకస్మాత్తుగా మార్పు లు వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత వివిధ శాఖల్లో, అకాడమిల్లో, సంస్థల్లో డైరెక్టు రిక్రూట్‌మెంట్ పోస్టులు భర్తీ చేయడం సాధ్యంకాదని భావించిన ప్రభుత్వం పదోన్నతులు ద్వారా భర్తీ చేసింది. అయితే విద్యాశాఖ వరకూ ఉన్న లెక్కలు పరిశీలిస్తే డిప్యుటీ డిఇఓలు 40, డిప్యుటీ ఐఓఎస్ 2, పిఇటి లెక్చరర్లు 48, డైట్ లెక్చరర్లు 166, ఎంఇఓ 399 పోస్టులున్నాయి. పిజిటిలు 1131, టిజిటి 719, డ్రాయింట్ 254, క్రాఫ్ట్ 313, ఎల్‌పి 765, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు 270, పిఇటి 404, స్కూల్ అసిస్టెంట్‌లు 3367, స్పెషల్ టీచర్లు 616, ఎస్‌జిటి 11874, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లు 184 పోస్టులున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని స్కూళ్లలో పిఇటి 49, స్కూల్ అసిస్టెంట్లు బయాలజీ 164, ఇంగ్లీషు 167, హిందీ 136, మాథ్స్ 215, పిఎస్ 233, సోషల్ 117, తెలుగు 130, ఎస్‌జిటి 473 పోస్టులున్నాయి. అలాగే పిఇటిలు 186 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. పంచాయతీరాజ్ గ్రేడ్-1 పంచాయితీ సెక్రటరీలు 417, గ్రేడ్-2 పిఎస్‌లు 371, గ్రేడ్-3 పిఎస్‌లు 2111, గ్రేడ్-4 పిఎస్‌లు 1143, విఎఓలు 4081, విలేజ్ సర్వెంట్ విఆర్‌ఎలు 1087 పోస్టులున్నాయి.
గ్రూప్-1 పోస్టులు
గ్రూప్ -1 క్యాడర్‌లో డిఎస్పీలు 5, డివిజనల్ పంచాయితీ ఆఫీసర్ 2, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు 6, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌లు 19, ఎంపిడిఓలు 114, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 32 పోస్టులున్నాయి. గ్రూప్-2 కింద డిప్యుటీ తహసీల్దార్‌లు 156, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లు 77, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్‌లు 78, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్‌లు 45, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు 4, ఎక్సైజ్ సబ్ ఇనస్పెక్టర్లు 99, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు 290 ఉన్నాయి.
పెరగనున్న పోస్టులు
ఖాళీల్లో నోటిఫికేషన్ జారీ చేసే సమయానికి భారీగా పెరగనున్నట్టు తెలిసింది. అటవీ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, రెవిన్యూ శాఖ, విద్యా శాఖ, స్టాంప్స్ అండ్ రెవిన్యూ, దేవాదాయ శాఖల్లో చాలా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆ డాటా కూడా రాగానే మొత్తం పోస్టుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలతోపాటు ఆర్ అండ్ బి శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు స్పెషాలిటీ పోస్టుల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను సర్వీసు కమిషన్ జారీ చేయనుంది.