తెలంగాణ

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: వాయువ్య భారత్ నుంచి వీస్తున్న వేడి గాలులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ వేడిని పెంచుతున్నాయి. రికార్డు స్థాయిలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గత వారం వడగళ్ల వాన కురవడంతో వేడి ప్రభావం తగ్గుతుందని భావించినా, ఒకటి రెండు రోజులు గడవగానే తిరిగి ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు రోడ్డుపైకి రావడానికి భయపడుతున్నారు. ప్రధాన రహదారులు కూడా కర్ఫ్యూ విధించినట్టుగా మారిపోయాయి. తెలంగాణలో దాదాపు మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని, తప్పనిసరి అయితేనే తగిన జాగ్రత్తలతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తెలంగాణతో పాటు రాయలసీమ, కోస్తాంధ్రలోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. రాత్రి పది గంటల సమయంలో కూడా వడగాలులు వీస్తుండడం విస్మయం కలిగిస్తోంది. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఆరు డిగ్రీల మేరకు ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ నగరంలో ప్రధాన రోడ్లు అన్నీ జనం లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి.
ఈనెల 16న ఖమ్మం జిల్లా కొంజెర్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. వచ్చే వారం పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగత నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఎండల వల్ల పెద్దవారు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సచివాలయంలో సందర్శకులు, ఉద్యోగులు ఎండల వల్ల ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ ప్రారంభించారు. సందర్శకులు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందికి ఎండలు తగ్గేంత వరకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. సచివాలయం క్యాంటిన్ వద్ద, జిఎడిలో పంపిణి చేస్తారు.
chitram...
శుక్రవారం హైదరాబాద్‌లో మండుతున్న ఎండకు అవస్థపడుతున్న
రిక్షా కార్మికుడు