ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జలాల వృధా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 21: మండు వేసవి భగ భగమంటున్నా..జీవనది గోదావరి నదీ జలాలు ఊరకలెత్తుతూనే ఉన్నాయి. డ్రెడ్జింగ్ లేకపోవడం వల్ల ఎత్తిపోతల పధకాల ఇన్‌టేక్ వెల్స్ వద్దకు గోదావరి జలాలు అందడం లేదు. అవసరమైన చోట డ్రెడ్జింగ్ పనులు చేపట్టి ఉంటే వేసవిలో బ్యారేజి నుంచి జలాలను వదిలేయకుండా కనీసం ఎత్తిపోతల పథకాలకైనా వినియోగించుకునే అవకాశం ఉండేదని తెలుస్తోంది. వేసవిలో సైతం గోదావరి నదిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ వచ్చిన నీటిని దాచుకోలేకపోతున్నాము. ముందుచూపుతో ఎత్తిపోతల పథకాల ఇన్‌టేక్ వెల్స్ వద్ద జరిగి ఉంటే బ్యారేజి నుంచి జలాలు వృథా కాకుండా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండేది.
దీనికి తోడు భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు, పశుగణం వేసవి దాహార్తిని తీర్చేందుకు, సమ్మర్ స్టోరేజి ట్యాంకుల్లో నింపుకునేందుకు గానీ కనీస స్థాయిలో ఆలోచన చేయకుండా గోదావరి జలాలను వృథాగా బ్యారేజి నుంచి వదిలేయడం వల్ల ఇసుక తినె్నల్లో హరించుకు పోతున్నాయి. వేసవిలో సైతం సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలను వృధాగా వదిలేయడం తప్ప ఏమీ చేయలేమన్న ఉదాసీనత అధికారుల్లో కనిపిస్తోంది. డ్రెడ్జింగ్ అవసరమైన చోట జరిగి ఉంటే బ్యారేజి వద్ద లభించే జలాలను సమర్ధవంతంగా వేసవిలో సైతం ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వినియోగించుకునే అవకాశం ఉండేది. వేసవిలో సైతం గోదావరి జలాలు వృధా అవుతున్నాయని సాకుగా చూపించి వచ్చే ఏడాది నుంచి జిల్లాయేతర అవసరాలకు తరలించుకుపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ కుట్రలో భాగంగానే అధికారులు వృధాగా నీటిని వదిలేస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఏడాదిలో బ్యారేజి వద్ద మట్టం తక్కువగా ఉన్నప్పటికీ ట్రయిల్ బేస్‌లో పట్టిసీమకు వేసవిలో సైతం రోజుకు 3400 క్యూసెక్కుల జలాలను పట్టుకెళ్ళారు. వాస్తవానికి బ్యారేజి నుంచి 14.02 మీటర్ల నుంచి 13.64 మీటర్ల లోపు వరకు తోడవచ్చు. అంతకు దిగువకు తోడేందుకు వీల్లేదు. ప్రస్తుతం బ్యారేజి వద్ద 13.81 మీటర్లు వుంది. దీనిని బట్టి స్వల్పంగా పట్టిసీమకు నీటిని తోడవచ్చు. నీటిని వృధాగా వదిలేయడాన్ని సాకుగా తీసుకుని వచ్చే ఏడాది నుంచి వేసవిలో సైతం నీటిని జిల్లాయేతర అవసరాలకు పట్టుకెళ్ళే ప్రయత్నం కోసమే ఇపుడు సముద్రంలో వదిలేస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్యారేజి వద్ద ఆదివారం 2750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వుంది. 1824 క్యూసెక్కుల జలాలను 13.81 మీటర్ల పాండ్ లెవెల్‌ను నిర్వహిస్తూ సముద్రంలోకి వదిలేస్తున్నారు. సముద్రంలోకి అనడం కంటే ఇసుక తినె్నల్లోకి వదిలేస్తున్నారడం సబబు. ఎందుకంటే బ్యారేజి నుంచి వృధాగా వదిలేస్తున్న జలాలు సముద్రం వరకు చేరవు..బ్యారేజి దిగువన పాయల్లోని ఇసుక తినె్నల్లో హరించుకుపోతున్నాయి. బ్యారేజి నుంచి వదలకుండా మట్టాన్ని నిలబెడితే బ్యారేజి ఎగువ ప్రాంతానికి ఎగదన్ని ఆ జలాలు ఎత్తిపోతల పథకాల పంపుహౌస్‌లకు చేరే అవకాశం వుండేది. ఈ పంపుహౌస్‌లకు తోడేందుకు జలాలు అందితే కాల్వల ద్వారా నీటిని చెరువులకు పంపి భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు, పశువుల దాహార్తిని తీర్చేందుకు, ఇంకాస్త జలాలను తాగునీటి సమస్యతో అలమటిస్తోన్న ప్రాంతాల సమ్మర్ స్టోరేజిలను నింపుకునేందుకు దోహదపడేది. కానీ బ్యారేజి వద్ద నీటి మట్టాని నిలబెట్టి అఖండ గోదావరిలో బ్యారేజి ఎగువన జలాలు ఎగదనే్నలా చేసినప్పటికీ ఇసుక తినె్నలు పెరిగిపోయి ఇన్‌టేక్ వెల్స్ అన్నీ ఇసుకలో కూరుకుపోయాయి. దీనికి తోడు ఎత్తిపోతల పధకాల ప్రధాన కాలువలు కూడా నీరు పారేందుకు వీల్లేకుండా పూడుకుపోయివున్నాయి. మొత్తం మీద గోదావరి జలాలు వృధాగా ఇసుకలో హరించుకుపోతున్నాయి తప్ప సద్వినియోగం కావడం లేదు. నిర్ధేశిత పాండ్ లెవెల్ దాటిన తర్వాత బ్యారేజి నుంచి వదిలేయడం తప్ప మరో గత్యంతరం లేదు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఎవరికీ అర్థం కాదు. బ్యారేజికి వున్న ధవళేశ్వరం ఆర్మ్‌లో రెండు గేట్లను 0.20 మీటర్లు, విజ్జేశ్వరం ఆర్మ్‌లోని ఒక గేటును 0.10 మీటర్ల మేరకు ఎత్తివేసి గోదావరి జలాలను విడిచిపెడుతున్నారు. ఏప్రిల్ 20న కాలువలు మూసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18.942 టిఎంసిలు గోదావరి నదికి ఇన్‌ఫ్లో వుండగా, ఇప్పటి వరకు 16.985 టిఎంసిలు అవుట్ ఫ్లో వుంది. ప్రస్తుతం ఎల్‌సి (లైన్ క్లియరెన్స్) కారణంగా సీలేరులో పవర్ జనరేషన్ ఆపేశారు. దీంతో ప్రస్తుతం గోదావరి నదిలో సీలేరు జలాలు రావడం లేదు. కేవలం స్వయం సిద్ధ జలాలే ఇన్‌ఫ్లోగా వున్నాయి. గత ఏడాది ఇదే రోజుల్లో గోదావరి నదికి ఇన్‌ఫ్లో కేవలం 301 క్యూసెక్కులు మాత్రమే వుంది. ఇపుడు 2750 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదైంది.

చిత్రం.. కాటన్ బ్యారేజి వద్ద వృధాగా పోతున్న జలాలు