హైదరాబాద్

డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకునే యత్నంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నార్సింగి, మే 21: హైదరాబాద్‌లో వీకెండ్ డే సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. పలువురు మందుబాబులపై కేసులు నమోదు చేశారు. 11 కార్లు, 9 బైకులు, మూడు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. కాగా డ్రంకైన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. నగరంలోని లంగర్‌హౌజ్ బాపూఘాట్ వద్ద డ్రంకైన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా, తనిఖీల నుంచి తప్పించుకునేందుకు యత్నించి రాంగ్ రూట్‌లో వెళ్లిన బైక్ వేగంగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రంగారెడ్డి జిల్లా బుద్వేలుకు చెందిన శ్రీనివాస్, రాజేష్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల మృతితో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బైక్‌ను తప్పించడానికి క్రాస్ చేసిన లారీ అదుపుతప్పి పోలీస్ వాహనాన్ని, కారును ఢీకొంది. లారీని వెంబడించిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు లంగర్‌హౌజ్ పోలీసులు తెలిపారు.