తెలంగాణ

ప్రాజెక్టులపై కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రగతి భవన్ నుంచే పనుల పర్యవేక్షణ
లైవ్‌లో పనులు వీక్షించిన సిఎం కెసిఆర్
ప్రాజెక్టులు పూర్తి కాకముందే చెరువుల్లోకి నీళ్లు
విద్యుత్ బిల్లులు 15 వేల కోట్లు ప్రభుత్వ బాధ్యత
2018 చివరికల్లా అన్ని బ్యారేజీలు పూర్తి చేయాలి
నీటిపారుదల శాఖపై సిఎం కెసిఆర్ సుదీర్ఘ సమీక్ష
హైదరాబాద్, మే 22: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రగతి భవన్ నుంచే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సోమవారం వీక్షించారు. ప్రాజెక్టుల వద్ద కెమెరాలు అమర్చి వాటిని క్యాంపు కార్యాలయానికి అనుసంధానించటంతో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సిఎం లైవ్‌లో పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఐదు, ఆరు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సమాంతరంగా జరగడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు ఉన్న మార్గంలో 81 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 78.55 కి.మీ మేర తవ్వకం పనులు పూర్తి కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మిగతా పనులూ శరవేగంగా పూర్తి చేసి, రైతులకు సాధ్యమైనంత త్వరగా సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నదిలో, నదికి ఇరువైపులా జరుగుతున్న బ్యారేజీలు, ఇన్ టేక్ వెల్, పంప్ హౌజ్ నిర్మాణ పనులు రేయింబవళ్లు జరుగుతుండటం పట్ల సిఎం అధికారులను అభినందించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాకముందే కాలువల ద్వారా చెరువులు నింపాలని ఆదేశించారు. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు కట్టడానికి మందే ఆ మార్గంలో కాలువ నిర్మాణం జరగాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. బడ్జెట్ పెరుగుతున్నకొద్దీ ఎక్కువమంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేస్తామన్నారు. రైతులకు సాగునీరు అందించడానికి అవసరమైతే ఎత్తిపోతల పథకాల కరంట్ బిల్లులు రూ. 15 వేల కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. సాగునీటి రంగానికి సంబంధించి ఏడేళ్ల ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితి నుంచి ఏడేళ్ల వరకూ కార్యాచరణ, విజన్‌ను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఈఎన్‌సి మురళీధర్‌రావు, జలవనరుల నిర్వహణ కమిటీ చైర్మన్ వి ప్రకాశ్, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటిపారుదల రంగం ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి పాల్గొన్నారు.

చిత్రం... సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్